'కోలీవుడ్ లా ప్లాన్ చేసుకోవాలి.. చిన్న సినిమాలను బతకనివ్వండి'

టాలీవుడ్ లో థియేటర్ల కేటాయింపు, సినిమాల విడుదల తేదీల గందరగోళంపై యంగ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Update: 2026-10-22 10:02 GMT

టాలీవుడ్ లో థియేటర్ల కేటాయింపు, సినిమాల విడుదల తేదీల గందరగోళంపై యంగ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. చిన్న సినిమాలు బతకాలంటే బడా నిర్మాతలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తెలుగులో హెల్దీ ఎన్విరాన్మెంట్ మిస్ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న మూవీల సమస్యకు సొల్యూషన్ దొరకాలంటే, వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసే పెద్ద నిర్మాతలు కొంచెం పెద్ద మనసు చేసుకోవాలని సూచించారు. విడుదల తేదీలను సరైన పద్ధతిలో ప్లాన్ చేసుకుంటూ, చిన్న సినిమాలకు కూడా థియేటర్లు దొరికేలా 'స్పేస్' ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరని, వారికి ఉండే సౌకర్యాలు తమలాంటి చిన్న నిర్మాతలకి ఉండవని పేర్కొన్నారు.

ఎగ్జాంపుల్ కు, సీనియర్ హీరో వెంకటేష్ గారి సినిమా ఉందనుకుంటే, ఆ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు ప్రకటించినా సరే థియేటర్లు దొరుకుతాయని, ఆడియన్స్ కూడా వస్తారని చెప్పారు. ఆ లగ్జరీ, ఆ కెపాసిటీ పెద్ద సినిమాలకు ఉంటుంది కానీ, తమలాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. చిన్న సినిమాలు జనాల్లోకి వెళ్లాలంటే కనీసం రెండు మూడు వారాల ముందే విడుదల తేదీని ప్రకటించి, పబ్లిసిటీ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

తమ సినిమా సమ్మర్ హాలీడేస్ విడుదల కోసం ముందుగా అక్టోబర్ 30వ తేదీని అనుకున్నామని, దాని కోసం చాలా ఖర్చు చేశామని ధీరజ్ వెల్లడించారు. మెట్రో రైలు పిల్లర్లు, ఆటోల వెనుక పోస్టర్లు, టీవీ ఛానళ్లలో యాడ్స్ ఇవ్వడమే కాకుండా, థియేటర్లలో విడుదలైన సినిమాల మధ్యలో తమ టీజర్లు ప్లే చేయడానికి భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పారు. కానీ చివరి నిమిషంలో పెద్ద సినిమాల వల్ల డేట్ మార్చుకోవాల్సి వచ్చిందని, బయట నుంచి అప్పులు తెచ్చి పబ్లిసిటీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

మన పక్కనే ఉన్న తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఒకరికొకరు ఎలా కోపరేట్ చేసుకుంటారో ధీరజ్ ఎగ్జాంపుల్స్ తో వివరించారు. ఇటీవల అక్కడ హీరో ధనుష్ సినిమా విడుదల సమయంలో 'జైలర్ 2' వస్తుందా రాదా అనే సస్పెన్స్ ఉండిందని చెప్పారు. అయితే బాక్సాఫీస్ వద్ద అనవసరమైన పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో, ధనుష్ తన సినిమాను ముందే వాయిదా వేసుకున్నారని గుర్తుచేశారు. అలా వాయిదా వేసేటప్పుడు కూడా, నవంబర్ 6న సూర్య గారి సినిమా వస్తోంది కాబట్టి, ఆ డేట్‌ కు కూడా డిస్టర్బెన్స్ కాకుండా లాంగ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారని తెలిపారు.

మన టాలీవుడ్‌ లో కూడా అలా చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు. గతంలో 'లెనిన్' సినిమా విడుదల సమయంలోనూ ఇలాంటి అన్యాయమే జరిగిందని ఆయన గుర్తుచేశారు. చిన్న నిర్మాతలు ఎంత మొత్తుకున్నా, ఎంత ఆవేదన వ్యక్తం చేసినా పరిస్థితి మారదని అభిప్రాయపడ్డారు. బడా నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే పర్మెనంట్ సొల్యూషన్ దొరుకుందంటూ చెప్పుకొచ్చారు. మరి ధీరజ్ కామెంట్స్ పై ఎవరైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.



Tags:    

Similar News