రామాయణ' ప్రయోగం అవసరమా?
టెలికాం రంగంలో జియో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదేళ్లకు ముందు టెలికాం రంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే కనీసం ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.
టెలికాం రంగంలో జియో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదేళ్లకు ముందు టెలికాం రంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే కనీసం ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెడితే ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్డింగ్‌లో ఉన్న ఓటీటీ బిజినెస్‌లోనూ అంబానీ అడుగు పెట్టిన విషయం తెల్సిందే. హాట్‌స్టార్ ను జియో కొనుగోలు చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ ఇండియన్ వినోద రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు, సిరీస్‌లు ఇలా ప్రతి ఒక్కటి జియో హాట్‌స్టార్‌లో చూసే వీలు ఉంది. అందుకు తగ్గట్టుగా భారీ మొత్తం ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త బిజినెస్ మోడల్‌కు జియో హాట్‌స్టార్ రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం...
ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నితేష్ తివారీ 'రామాయణ' సినిమా యొక్క ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ దాదాపుగా రూ.750 కోట్లను కోట్ చేసిందని, కానీ నితేష్ తివారీ రూ.1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. జియో హాట్‌స్టార్ ఆ మొత్తంను ఇచ్చేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. అయితే సినిమాను కనీసం మూడు నెలల పాటు పే పర్ వ్యూ పద్దతిలో స్ట్రీమింగ్ చేయాలని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. ఈ పద్ధతి ద్వారా వచ్చే మొత్తంలో కొంత భాగం ను నిర్మాతలకు సైతం ఇవ్వనున్నారు. అంటే నిర్మాతలు ఆశించిన రూ.1000 కోట్లకు మించి రామాయణ సినిమా కేవలం ఓటీటీ ద్వారా తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. హాలీవుడ్‌లో చాలా సినిమాలు ఇలా పే పర్ వ్యూ రూపంలో స్ట్రీమింగ్ అయ్యాయి.
పే పర్ వ్యూ పద్దతిలో రామాయణం...
గతంలో ఇండియన్ సినిమాలు సైతం ఓటీటీలో పే పర్ వ్యూ పద్దతిలో స్ట్రీమింగ్ అయ్యాయి. కాని అంతగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. కానీ రామాయణ సినిమా విషయంలో పే పర్ వ్యూ పద్దతి కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, భారీ మొత్తంలో ఆదాయం రాబట్టే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. జియో హాట్ స్టార్ నుంచి ఒక ఆసక్తికర ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ ప్రకారం సినిమాను స్ట్రీమింగ్ చేస్తే ఎక్కువ మంది పే పర్ వ్యూ పద్దతిలో చూస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అయితే ఆ ప్లాన్ ఏంటి అనేది సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాతే వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ స్ట్రీమింగ్‌కు కనీసం నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. థియేటర్ల ద్వారా భారీ మొత్తంలో వసూళ్లను ఆశిస్తున్న నిర్మాతలు ఓటీటీ ద్వారా కూడా అదే స్థాయిలో ఆదాయం ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
జియో సరికొత్త ప్రయోగం...
ఇప్పటి వరకు జియో హాట్‌స్టార్ లో పే పర్ వ్యూ పద్దతిలో సినిమాలు స్ట్రీమింగ్ కాలేదు. మొదటి సారి ఈ ప్రయత్నం చేస్తున్నారు. జియో ఈ ప్రయోగం చేయబోతున్నారు. జియో ద్వారా చేసిన ప్రయోగాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమాతో అద్భుతమైన స్పందన దక్కడం ఖాయం అని, ఏదో ఒక మ్యాజిక్ జరగడం ఖాయం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇండియన్ సినీ ప్రేమికులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణ సినిమా విషయంలో ఇలాంటి ప్రయోగం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
దాదాపుగా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. రెండు లేదా మూడు పార్ట్‌లుగా సినిమా విడుదల కాబోతుంది. మొదటి పార్ట్‌ను ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రెండో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రానుంది. దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటించిన ఈ సినిమా రామాయణంను సరికొత్తగా చూపిస్తుందా అనేది చూడాలి.