పరశురామ్ కు దీపావళి గిఫ్ట్​ పంపిన మహేశ్​..ఎమోషనల్​ అయిన డైరెక్టర్​

Update: 2020-11-14 10:50 GMT
సూపర్​స్టార్​ మహేశ్​బాబు ఎంత ప్రొఫెషనల్​గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన మన తాను చేసుకుంటూ ఎప్పుడు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. దర్శక, నిర్మాతలకు ఎంతో గౌరవం ఇస్తుంటాడు. కేవలం దర్శకుడు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్​ఫుల్​ హీరోగా నిలిచిపోయాడు. మహేష్ బాబు దర్శకుల హీరో అని చెబుతుంటారు. తన దర్శకులను ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేస్తుంటాడు. తాజాగా మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ బహుమతులు చూసి పరుశ్​రామ్​ ఎంతో ఎమెషనల్​ అయ్యాడు.

మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్​ ఇచ్చిన మహేశ్​.. చాలా కథలు విని చివరకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించాడు.  ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసుకున్నది. ఆ సినిమా షూటింగ్​ కేవలం ఆరునెలల్లోనే పూర్తయ్యింది. ఈ తర్వాత మళ్లీ ఎన్నో కథలు విని.. చివరకు పరుశరామ్​ వినిపించిన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి  కనెక్ట్​ అయ్యాడు. కరోనాతో ఆ సినిమా షూటిం ఆలస్యంగా నడుస్తున్నది. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ నవంబర్ చివర్లో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ చాలాగ్యాప్​ తర్వాత యూఎస్​ వెళ్లాడు. తాజాగా ప్రేక్షకులకు, అభిమానులు దీపావళి విషెస్ తెలిపాడు. కాలుష్యానికి దూరంగా ఉండండని కోరాడు. అయితే మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్‌కు దీపావళి సందర్భంగా బహుమతులను పంపాడు. వాటిని పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గాల్లో తేలిపోయాడు. తనకు ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలాంటి గిఫ్ట్స్​ పంపలేదని పేర్కొన్నాడు పరుశురామ్​.
Tags:    

Similar News