నా గొడవేదో నేనే పడతాను .. ప్రయోగాలు మాత్రం చేయను: మహేశ్ బాబు
మహేశ్ బాబు వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. ఒక సినిమా పూర్తయ్యేలోగా మరో ప్రాజెక్టును సెట్ చేసుకుంటాడు. అంతే తప్ప ఒక సినిమా షూటింగు దశలో ఉండగా, మరో సినిమాను పట్టాలెక్కించే పనులు మాత్రం చేయడు. తన సినిమా ఓపెనింగ్స్ కి తాను రాకపోవడం ఆయనకి ఓ సెంటిమెంట్. అప్పుడు మాత్రం నమ్రత వచ్చి, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మహేశ్ బాబు సినిమాలకు సంబంధించిన కథలను నమ్రత వింటారనే టాక్ ఉంది. అలాగే ఆయన సినిమాల నిర్మాణపరమైన భాగస్వామ్య వ్యవహారాలను ఆమెనే చక్కబెడుతుందని చెప్పుకుంటూ ఉంటారు. ఆమెపై పూర్తి నమ్మకంతో మహేశ్ హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళతాడని అనుకుంటారు.
తాజాగా ఈ విషయాలపై మహేశ్ స్పందించారు. " నా సినిమా కథలను నేనే వింటాను. ఇప్పుడే కాదు .. పెళ్లికి ముందు నుంచి కూడా. నా సినిమాలు హిట్ అయినా .. ఫ్లాప్ అయినా అందుకు నేనే బాధ్యుడిని. నా సినిమా ఏదైనా ఆడియన్స్ కి నచ్చకపోతే అందుకు కారణాలు ఆలోచన చేస్తాను. మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. అలా నా అనుభవాల నుంచి నేర్చుకోవడానికే నేను ప్రయత్నిస్తాను. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా నన్ను మెరుగుపరుచుకోవడానికి ట్రై చేస్తాను. నాకు నచ్చిన కథలను నేను చేసుకువెళుతుంటాను. అంతేగాని ప్రయోగాలు చేయాలనుకోవడం లేదు. 'స్పైడర్' సినిమాతో నేర్చుకున్న పాఠమే అందుకు కారణం.
నా అభిమానులు ఎప్పుడూ కూడా నేను చాలా గొప్ప సినిమాలు చేయాలనీ, నా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలనే కోరుకుంటూ ఉంటారు. వాళ్ల సంతోషానికి తగిన కథలు చేయాలనీ, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలని నాకూ ఉంటుంది. కాకపోతే అన్నీ కలిసి రావాలి. ఒక సినిమా విజయాన్ని సాధించాలంటే అందుకు ఎన్నో కలిసిరావాలి. కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు .. ఆ విషయాన్ని గ్రహించే అవకాశం కూడా లేకపోవచ్చు. అలాంటప్పుడు నేను కూడా చాలా ఫీలవుతాను. తరువాత సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేస్తుంటాను. నాకు సంబంధించిన విషయాలన్నీ నా సమక్షంలోనే జరుగుతాయి. ఎవరిపై ఎప్పుడూ ఆధారపడను" అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'స్పెయిన్'లో జరుగుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెలతో ఈ సినిమా షూటింగు పూర్తి కానుంది. వచ్చేనెలలో ఆయన త్రివిక్రమ్ తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు ఆల్రెడీ మొదలైపోయాయి. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.
ఇక త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తరువాత రాజమౌళితో మహేశ్ బాబు ప్రాజెక్టు మొదలుకానుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ మహేశ్ కనిపించిన లుక్ కి పూర్తి భిన్నమైన లుక్ తో రాజమౌళి చూపించనున్నారని అంటున్నారు. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ లకు సంచలన విజయాలను అందించిన రాజమౌళి, తమ హీరోకి కూడా బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనే నమ్మకంతో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.