వీడియో: ఇంత‌కీ ఆ టీనేజీ పిల్లాడు ఎవరై ఉంటారు?

Update: 2020-04-17 03:30 GMT
ఎంత పెద్ద సూప‌ర్ స్టార్ అయినా ఇంట్లో మాత్రం చిన్న పిల్లాడిగా మారిపోవాల్సిందేనా? అంటే అవున‌నే అంటారు ఈ వీడియో చూస్తే. స్టారాధి స్టార్లు అయినా వార‌సుల‌తో క‌లిసి స‌ర‌దా స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేస్తే ఆ మ‌జానే వేరు క‌దా!  ఇదిగో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని చూసి ఎవ‌రైనా నేర్చుకోవాల్సిందే ఎవ‌రైనా. టైమ్ దొరికితే చాలు చిన్న పిల్లల‌తో క‌లిసిపోయి ఇదిగో ఎలా ఆడుకుంటున్నాడో. తానే టీనేజీ పిల్లాడై పోయాడు ఏ భేషజం లేకుండా.

బ‌హుశా ఇదే మ‌హేష్ గ్లామ‌ర్ సీక్రెట్ అయ్యి ఉండొచ్చు. నిరంత‌ర ఒత్తిళ్ల జీవితం లో ఫ్యామిలీకి స‌మ‌యం కేటాయిస్తే ఆటోమెటిగ్గా అన్నిటినుంచి బ‌య‌ట‌ ప‌డేందుకు ఆస్కారం ఉంటుంది. పిల్ల‌ల‌తో క‌లిసి పిల్లాడిగా క‌లిసిపోయి ఆట‌లాడుకుంటే అల‌స‌ట అంతా మ‌టు మాయం అవుతుంది. ఇలాంటి విష‌యాల్లో మ‌హేష్ త‌ర్వాత‌నే ఎవ‌రైనా. ఫ్యామిలీకి కావాల్సినంత టైమ్ కేటాయించ‌డ‌మే గాక ఎంతో బ్యాలెన్సింగ్ గా లైఫ్ ని లీడ్ చేయ‌డం సూప‌ర్ స్టార్ కృష్ణ నుంచి అబ్బిన‌దే. ఇక క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల నెల‌ల కొద్దీ స‌మ‌యం లాక్ డౌన్ అయిపోవాల్సిన ప‌రిస్థితి ఉంది. అందుకే ఈ క్వారంటైన్ టైమ్ ని కిడ్స్ గౌత‌మ్ - సితార  తో క‌లిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మ‌హేష్‌.

ఇంట్లోనే ఉండండి .. క్షేమంగా ఉండండి! అంటూ అభిమానుల‌కు పిలుపునిచ్చిన మ‌హేష్ .. ఇదిగో నాలా మీరు కూడా ఇంట్లోనే ఆట‌లాడుకోండి అంటూ ప‌రోక్షంగా సందేశం ఇచ్చాడు మ‌రి. రోజంతా ఇదిగో ఇలానే గ‌డిపేస్తున్నా. గౌత‌మ్ తో రాత్రి పూట ఇలా ఆట‌లాడుకుంటున్నా`` అని కూడా తెలిపారు. ఏమిటో.. లాక్ డౌన్ ఎత్తేసేదెపుడో?   తిరిగి షూటింగులో జాయిన్ అయ్యేదెపుడో? అప్ప‌టివ‌ర‌కూ ఇలా ఆట‌లాడుకుంటూ .. ప‌నిలో ప‌నిగా కొత్త క‌థ‌లు విని ద‌ర్శ‌కుల్ని ఫైన‌లైజ్ చేయ‌డం లాంటి ప‌నుల‌తో ఇలా కాలం సాగిపోతోంద‌న్న‌మాట‌. త‌దుప‌రి ప‌ర‌శురామ్ తో ఖాయం చేసుకున్న‌ట్టేనా కాదా? అన్న‌ది మ‌హేష్ చెబితే బావుండేది.
Tags:    

Similar News