హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇక ఇప్పుడు అదే తెలంగాణా నేపథ్యంతో వచ్చిన సినిమా దండోరా. ఈ సినిమాను మురళి కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేశారు.;

Update: 2025-12-27 09:35 GMT

తెలంగాణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఈమధ్య తెర మీదకు వస్తున్నాయి. ఐతే వాటిలో ఒక్కో సినిమా ఒక్కో నేపథ్యంతో వస్తుంది. బలగం సినిమా తెలంగాణా పల్లెలో అనుబంధాల గురించి తీస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు అదే తెలంగాణా నేపథ్యంతో వచ్చిన సినిమా దండోరా. ఈ సినిమాను మురళి కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేశారు. సినిమాలో శివాజి, బిందు మాధవి, నవదీప్, మౌనిక ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు.

తెలంగాణా ఆర్ & బి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజైంది. ఈ సినిమా గురించి తెలంగాణా ఆర్ & బి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తన సోషల్ మీడియాలో ఒక లెంగ్తీ మెసేజ్ పెట్టి సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు మినిస్టర్ కోమటిరెడ్డి.

ఆయన ఏమని రాసుకొచ్చారంటే.. తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుంది. అంతేకాదు ఈ సినిమాలో గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుంది. మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమా దండోరా అని చెప్పారు.

దండోరా టీమ్‌కు అభినందనలు..

చివరగా బలగం తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా దండోరా అని రాసుకొచ్చారు. వినోదంతో పాటు విలువైన సందేశం అందించిన దండోరా టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు చెప్పారు తెలంగాణా మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. దండోరా సినిమాపై మినిస్టర్ చేసిన ఈ సోషల్ మీడియా రెస్పాన్స్ పై న్యూస్ వైరల్ అవుతుంది.

దండోరా సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ముఖ్యంగా తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అవ్వడం వల్ల మౌత్ టాక్ ఇంకాస్త ఎక్కువ స్ప్రెడ్ అవ్వాల్సి ఉంది. ఐతే సినిమా రిజల్ట్ ఏదైనా సినిమాటోగ్రఫీ మినిస్టర్ మనసులు గెలిచింది కాబట్టి ఆయన మెసేజ్ తో మరికొంతమందికి ఈ దండోరా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దండోరాతో పాటు పోటీగా రోషన్ ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంబాల పోటీ పడ్డాయి. దండోరా సినిమాపై కోమటిరెడ్డి స్పెషల్ పోస్ట్ ఆ సినిమాను ఎంతోకొంత బూస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. తెలంగాణా బ్యాక్ డ్రాప్ కథలు ఇంకా మరెన్నో తెరకెక్కించేలా ఇలాంటి సినిమాల ఫలితాలు ఎంకరేజింగ్ గా ఉంటాయి.



Tags:    

Similar News