పబ్బులో చిరు, వెంకీ ఆట పాట.. ప్రోమో అదిరింది..!
ఈ సాంగ్ అలాంటి ఇలాంటి సాంగ్ కాదు. మెగా విక్టరీ మాస్ సాంగ్ గా వస్తుంది. అదేంటి అంటే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మన విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా గారుసంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. పొంగల్ రేసులో మస్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఈ సినిమా రెడీ అవుతుంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. ఇక లేటెస్ట్ గా ఎం.ఎస్.జి నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది.
విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో..
ఈ సాంగ్ అలాంటి ఇలాంటి సాంగ్ కాదు. మెగా విక్టరీ మాస్ సాంగ్ గా వస్తుంది. అదేంటి అంటే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మన విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నారు. ఈ రోల్ తో పాటు చిరంజీవితో కలిసి ఒక సాంగ్ కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిసి చేసిన ఈ మెగా విక్టరీ సాంగ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది.
భీమ్స్ మాస్ బీట్ కి పబ్ బ్యాక్ డ్రాప్ లో మంచి మాస్ అండ్ పెప్పీ సాంగ్ గా ఈ పాట వస్తుందని అనిపిస్తుంది. మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో లో పెద్దగా మ్యూజిక్ ఇవ్వలేదు కానీ అలా ఒకే స్క్రీన్ లో చిరంజీవి, వెంకటేష్ ను చూస్తుంటే ఫ్యాన్ ఫీస్ట్ పక్కా అనేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం ఆడియన్స్ కి థ్రిల్ అనిపిస్తుంది.
సంక్రాంతికి చిరంజీవి ఎం.ఎస్.జి తో పాటు..
ఈ సంక్రాంతికి చిరుతో పాటు వెంకటేష్ చేసే హంగామా ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. మెగా విక్టరీ సాంగ్ ప్రోమో అదిరిపోగా ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. కచ్చితంగా న్యూ ఇయర్ పార్టీకి సరిపోయేలా ఈ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారుసినిమాలో మిగతా ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉన్నా చిరంజీవి, వెంకటేష్ స్క్రీన్ షేరింగ్ అన్నది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
తెలుగు సినిమా నాలుగు స్థంబాల్లో ఇద్దరైన చిరంజీవి, వెంకటేష్ ఇలా ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ కి అంతకుమించిన ఐ ఫీస్ట్ మరోటి ఉండదని చెప్పొచ్చు. సంక్రాంతికి చిరంజీవి ఎం.ఎస్.జి తో పాటు మరో నాలుగైదు సినిమాలు రేసులో ఉన్నా కూడా ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అనిపించేలా మెగా మూవీ రానుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా భాగం అవ్వడం దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ కి తమ హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ దక్కినట్టు అవుతుంది.