సితార ఘ‌ట్ట‌మ‌నేని.. దేశంలోని నేపో కిడ్స్ అంద‌రికీ స‌వాల్!

క్యూట్ అమ్మాయి సితార ఘ‌ట్ట‌మ‌నేని ఏ ఇత‌ర నేపోకిడ్స్ కంటే కూడా అత్యుత్త‌మ‌మైన రూపం, ట్రెడిష‌న్ తో ఆక‌ర్షిస్తోంది.;

Update: 2026-02-11 17:20 GMT

క్యూట్ అమ్మాయి సితార ఘ‌ట్ట‌మ‌నేని ఏ ఇత‌ర నేపోకిడ్స్ కంటే కూడా అత్యుత్త‌మ‌మైన రూపం, ట్రెడిష‌న్ తో ఆక‌ర్షిస్తోంది. టీనేజీ గాళ్ ఈ ప్ర‌పంచాన్ని మంత్ర‌ముగ్ధం చేస్తోంది. అంతేకాదు.. తండ్రికి త‌గ్గ త‌న‌యగా సితార న‌ట‌వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళుతుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో సితార దూసుకెళుతోంది. సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తూనే ఘ‌ట్ట‌మ‌నేని స్టార్ కిడ్ ఇండ‌స్ట్రీని ఏల్తారా? న‌ట‌నారంగంలోకి వెళ‌తారా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని తన క్యూట్‌నెస్, కాన్ఫిడెన్స్, సంప్రదాయబద్ధమైన శైలితో ఇప్పటికే ఒక చిన్నపాటి స్టార్‌డమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార‌ డ్యాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్ చూస్తుంటే భవిష్యత్తులో భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ను ఏలే స్టార్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సితార చాలా పరిణతితో సమాధానమిచ్చారు. నేను ఇంకా చాలా చిన్నదాన్ని.. ఇప్పుడే ప్ర‌తిదీ అర్థం చేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని ఉత్సాహంగా ఉన్నాను. నేను ఏ మార్గాన్ని ఎంచుకున్నా మా అమ్మనాన్నలు నాకు మార్గదర్శకత్వం వహిస్తారని, మద్దతుగా నిలుస్తారని నాకు తెలుసు. ప్రస్తుతానికి నేను ఈ ప్రయాణాన్ని ఆస్వాధిస్తున్నాను`` అని సితార అన్నారు. నేరుగా నటిని అవుతాన‌ని చెప్పకపోయినా కెమెరా ముందు ఉన్న ఈజ్, డ్యాన్స్‌పై ఉన్న మక్కువ చూసిన‌ప్పుడు సితార వెండితెరపై మెరవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

బాలీవుడ్ నేపో కిడ్స్ అనన్య, సారా, సుహానా ఖాన్ వంటి వారికి సితార ఘ‌ట్ట‌మ‌నేని పోటీ ఇస్తారా? అంటే.. క‌చ్చితంగా అందుకు అవ‌కాశం ఉంది. నిజానికి సితారకు ఒక ప్రత్యేకమైన ఆక‌ర్ష‌ణ ఉంది. త‌న నేచురల్ లుక్ ఎంతో ముచ్చ‌ట‌గొలుపుతుంది. నేపో కిడ్స్ అనన్య, సారా తరచుగా గ్లామర్ ప‌ర‌మైన విష‌యాల‌లో వెస్ట్రన్ లుక్స్‌పై దృష్టి పెడతారు. కానీ సితార తన సాంప్రదాయబద్ధమైన రూపంతోనూ, పద్ధతైన ఆహార్యంతోనూ దేశ వ్యాప్తంగా అభిమానుల‌కు బాగా దగ్గరైంది.

టీనేజ్‌లోనే ఒక ప్రముఖ జువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారి, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై కనిపించిన తొలి స్టార్ కిడ్‌గా రికార్డు సృష్టించింది. ఇది సితార‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఏపీ తెలంగాణ‌లో చాలా హోర్డింగులలో, షాపుల ముందు ఫ్లెక్సీల్లో సితార దివ్య‌మైన రూపం క‌ట్టి ప‌డేస్తోంది. త‌న‌కు భారీగా అభిమానుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది సితార బ్రాండ్ వ్యాల్యూని అమాంతం పెంచుతోంది.

ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో త‌న‌ స్టైల్ మంత్ర గురించి సితార చెబుతూ..నా స్టైల్ మంత్ర క్లాసీగా ఉండాలి కానీ అతిగా ఉండకూడదు. సౌకర్యవంతంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉండటం నాకు ఇష్టం అని అన్నారు. అలాగే ఆభ‌ర‌ణాల‌పై తన ఆస‌క్తి గురించి మాట్లాడుతూ.. నగలు అనేవి మన డ్రెస్సింగ్‌ను ఎలివేట్ చేయాలి తప్ప, మనల్ని డామినేట్ చేయకూడదు. అందుకే నాకు `సితార కలెక్షన్` అంటే ఇష్టం. ఇది చాలా ఫెమినిన్, ఎలిగెంట్‌గా ఉంటుందని అన్నారు.

తనను మోటివేట్ చేసేది ఏది? అని ప్ర‌శ్నిస్తే, .. చాలా మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపడం, సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించే అవకాశమే నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తుంద‌ని సితార ప‌రిణ‌తితో మాట్లాడారు. కేవలం మహేష్ బాబు కూతురు అనే ట్యాగ్‌తోనే కాకుండా, తనకంటూ ఒక సొంత గుర్తింపును క్రియేట్ చేసుకుంటోంది. తండ్రిలోని క్ర‌మ‌శిక్ష‌ణ, తల్లి నమ్రతకు ఉన్న మేనేజ్‌మెంట్ స్కిల్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో సితార‌ ఘట్టమనేని వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయం.

Tags:    

Similar News