'ఛాంపియన్' 2 రోజుల లెక్కలు.. టాక్ ఒకలా, కలెక్షన్స్ మరొకలా!

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా వంటి బడా బ్యానర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ఛాంపియన్' పై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.;

Update: 2025-12-27 07:41 GMT

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా వంటి బడా బ్యానర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ఛాంపియన్' పై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రోషన్ మేక హీరోగా నటించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు నుంచే సినిమాపై కాస్ట్ టాక్ భిన్నంగా వచ్చింది. కథలో కొత్తదనం ఉన్నా, కథనం నెమ్మదిగా ఉందని, ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో లేదని కొందరు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా డివైడ్ టాక్ నడిచింది.




అయితే బయట వినిపిస్తున్న టాక్ కు, బాక్సాఫీస్ దగ్గర నమోదవుతున్న వసూళ్లకు సంబంధం లేనట్లుగా సినిమా పర్ఫార్మ్ చేస్తోంది. రివ్యూలు ఎలా ఉన్నా, ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ మాత్రం థియేటర్ల వైపు చూస్తున్నారు. మేకర్స్ చేసిన భారీ ప్రమోషన్స్, మ్యూజిక్ ఆల్బమ్ సక్సెస్ అవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. దీంతో ఓపెనింగ్స్ పరంగా సినిమా డీసెంట్ గానే మొదలైంది.

లేటెస్ట్ గా మేకర్స్ సినిమా కలెక్షన్స్ కి సంబంధించి ఒక అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. దాని ప్రకారం 'ఛాంపియన్' సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 6.91 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రోషన్ కి ఇది హీరోగా రెండో సినిమా మాత్రమే. ఒక యంగ్ హీరో సినిమాకి, అందులోనూ మిక్స్డ్ టాక్ తో రెండు రోజుల్లో ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది సానుకూల అంశమే.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 20 కోట్ల గ్రాస్ వరకు ఉంది. రెండు రోజుల్లో 6.91 కోట్లు వచ్చాయి కాబట్టి, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటం, క్రిస్మస్ సెలవులు కలిసి రావడం వల్ల ఈ నంబర్స్ నమోదయ్యాయి. ఈ జోరు సోమవారం నుంచి కూడా కొనసాగితేనే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

సినిమాలో నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉండటం, రోషన్ నటన మెచ్యూర్డ్ గా ఉండటం ఆడియెన్స్ ని థియేటర్ వరకు రప్పిస్తున్నాయి. కంటెంట్ పరంగా కంప్లైంట్స్ ఉన్నా, విజువల్ గా సినిమా గ్రాండ్ గా ఉందనే మౌత్ టాక్ హెల్ప్ అవుతోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ కి రెస్పాన్స్ పర్వాలేదనిపిస్తోంది.

ఏదేమైనా 'ఛాంపియన్' బాక్సాఫీస్ జర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. హిట్ అని చెప్పలేం కానీ, ఫ్లాప్ అనేంత డల్ గా కూడా లేదు. ఈ వీకెండ్ మొత్తం స్ట్రాంగ్ గా నిలబడితే, బయ్యర్లు గట్టెక్కే ఛాన్స్ ఉంది. సోమవారం వచ్చే కలెక్షన్స్ మీదే ఈ సినిమా అసలైన ఫలితం ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News