14 ఏళ్ళ తర్వాత అడగొద్దన్న మహేష్
మహేష్ చాలా పొదుపుగా మాట్లడతాడని అందరికి తెలుసు కాని కొద్ది పదాల్లోనే అవతలి వాళ్ళను ఫిదా చేసే మేజిక్ కూడా వాటిలో ఉంటుంది. అయితే సందర్భం వస్తేనే సుమా. లేకపోతే ప్రిన్స్ ను అదే పనిగా పలకరించడం కొంచెం కష్టమే. నిన్న ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మహేష్ వద్ద తన ప్రేమ కథ ప్రస్తావన వచ్చింది. ఓ జర్నలిస్ట్ ఈ వాలెంటైన్ డే కి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు పెళ్లై 14 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగి తననుంచి ఏం ఆశిస్తున్నారని సున్నితంగా చురకలు వేసి అందరిని నవ్వించేసాడు.
అక్కడితో అయిపోలేదు. మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏది అనే ప్రశ్నకు భార్య నమ్రతా ఎదురుగా పెట్టుకుని తన కన్నా బెస్ట్ గా ప్రపోజ్ చేసేవాళ్ళు ఉంటారా అని ఇన్ డైరెక్ట్ గా పంచ్ ఇచ్చి మరోసారి నవ్వించేసాడు . అయితే ప్రేమికుల రోజుకు తన పెళ్ళికి లింక్ ఉందని మాత్రం చెప్పుకొచ్చాడు. తమ పెళ్లి రోజు ఫిబ్రవరి 10 అని అయితే మూడు రోజుల గ్యాప్ లోనే వాలెంటైన్ డే వస్తుంది కాబట్టి రెండు సందర్భాలను ఒకేరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు.
ఈ ఇద్దరి పరిచయం వంశీ సినిమాతో పరిచయమై పెళ్లి దాకా దారి తీసింది. తర్వాత గౌతం సితారలు వచ్చేసారు. మొత్తానికి ప్రెస్ తో సరదాగా గడిపిన మహేష్ నవ్వుల పువ్వులు పూయించాడు. మహర్షి పూర్తయ్యాక సుకుమార్ తో సినిమా కోసం చర్చల్లో ఉన్న ప్రిన్స్ దాని తర్వాత ఏది చేస్తాడు అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. సందీప్ వంగాతో పాటు త్రివిక్రమ్ పేర్లు వినిపిస్తున్నాయి కాని ఇవన్ని తేలేందుకు కొంత టైం అయితే పడుతుంది.