త్రివిక్రమ్.. మహేష్ కోసం ఎన్టీఆర్ ని పక్కన పెడతాడా..?

Update: 2020-04-07 15:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యాలని ఎందరో దర్శకులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 'సరిలేరు నీకెవ్వరూ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా మహేష్ సినిమా ఏ డైరెక్టర్ తో అనే విషయం ఫైనలైజ్ కాలేదు. ఈ నేపథ్యంలో మహేష్ - త్రివిక్రమ్ మళ్ళీ కలవబోతున్నారని సమాచారం. మ‌హేష్ బాబు – త్రివిక్రమ్‌ ల‌ది ఎవరు కాదన్నా ఒక మంచి కాంబినేష‌న్‌. 'అత‌డు' లాంటి సినిమా ఈరోజు వచ్చినా టీవీలు వదలకుండా చూస్తారు. ఇక 'ఖ‌లేజా' థియేట‌ర్లలో దెబ్బ వేసిన టీవీలలో మాత్రం ఎప్పుడు వచ్చినా టాప్ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అసలు 'ఖలేజా' ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదనేది దాదాపు సినీ అభిమానుల అందరి అభిప్రాయం. ఇక మొన్న సంక్రాంతికి ఇద్దరూ వేర్వేరు సినిమాలతో రంగంలోకి దిగి ఇద్దరూ హిట్ లు కొట్టారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఒకటి వస్తే బాగుండు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దానికి ఇప్పుడు రూట్ క్లియ‌ర్ అవుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మ‌హేష్ త‌దుప‌రి సినిమా ప‌రశురామ్ తో ఫిక్స‌యిపోయింది. కాక‌పోతే లేటెస్టుగా అందిన న్యూస్ ఏమిటంటే.. ఈమ‌ధ్య మ‌హేష్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నాడట. మీకు వీలైతే చెప్పండి.. సినిమా చేసేద్దామని మ‌హేష్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా సైతం ఫిక్స‌యిపోయింది. కానీ ఎన్టీఆర్ కాల్షీట్లు ఎప్ప‌టి నుంచి అందుబాటులో ఉంటాయ‌న్న‌ది స్ప‌ష్టం కాలేదు. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ సినిమా చేస్తాడు. ఒక‌వేళ ఎన్టీఆర్ సినిమా ఆల‌స్య‌మై, ఈమ‌ధ్య‌లో మ‌రో సినిమా చేసేంత స‌మ‌యం ద‌క్కితే ఈ కాంబోలో సినిమా మొద‌ల‌య్యే ఛాన్సులు కొట్టిపారేయ‌లేం. మ‌రి ప‌ర‌శురామ్ ఏం చేస్తాడు అనేదే ఇప్పుడు పెద్ద డౌటు. ప‌ర‌శురామ్ ని మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ ఆప్ష‌న్‌గానే భావిస్తూ వ‌స్తున్నాడు. ఏదీ కుద‌ర‌క‌పోతే… ప‌ర‌శురామ్ ఉన్నాడులే అనేది మ‌హేష్ ఆలోచ‌న‌. చేతిలో ప‌ర‌శురామ్ ని ఉంచుకుని, మిగిలిన రూట్ల‌న్నీ వెతకాలనుకుంటున్నాడట మ‌హేష్. ప‌ర‌శురామ్ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ఉంది. మరి ఈ లోపు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తారా.. లేక మహేష్ తో సినిమా చేస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా అవుతుంది.
Tags:    

Similar News