అమ్మమ్మతో సూపర్ స్టార్ అనుబంధం

Update: 2015-11-29 07:36 GMT
సినిమా స్టార్స్ ఫ్యామిలీ విషయాలు చాలా తక్కువగా బయటి ప్రపంచానికి తెలుస్తాయి. ప్రధానమైన మార్పులు తప్ప.. ఇంటర్నల్ మేటర్స్ విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటారు స్టార్స్ అంతా. అలాగే సూపర్ స్టార్ కృష్ణ.. తన రెండో పెళ్లిగా విజయనిర్మల గారిని చేసుకున్నారని అందరికీ తెలుసు. అప్పటికే మహేష్ బాబు కృష్ణ గారి అబ్బాయి. మరి మహేష్ బాబుకి తన అమ్మ - అమ్మమ్మలతో రిలేషన్ సంగతులు అంతగా ఎవరికీ తెలియవు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తనకు అమ్మమ్మతో అనుబంధాన్ని పంచుకున్నాడు మహేష్ బాబు. "మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నా.. తరచుగా మాతోనే కలిసి ఉండేవారు. మాతో ఎక్కువగానే కాలం గడిపేవారు. అలాగే మా అమ్మ - అమ్మమ్మల వయసు తేడా కేవలం 13-14 ఏళ్లు ఉంటుందంతే. వాళ్లిద్దరూ అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఉండేవారు. అమ్మమ్మ నా గురించి చాలా కేర్ తీసుకునేది. ఆమె చెప్పినట్లుగానే ఇళ్లు నడిచేది. నా జీవితంలో అమ్మమ్మ ప్రభావం చాలా ఎక్కువ. నాకు నచ్చిన వంటకాలు - ఫుడ్ అంతా ఆమెకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆమె దూరమయ్యాక.. అంతలా నా నచ్చేలా వంట చేసి పెట్టే వారు ఎవరూ లేరు"అన్నాడు మహేష్ బాబు.

అలాగే తన తల్లి గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా సింపుల్ మనిషి అని, ఎలాంటి కోరికలు అవసరాలు లేకుండా ఆమెలా బతకడం చాలా కష్టమని చెప్పాడు మహేష్ బాబు.
Tags:    

Similar News