• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ హిట్ మూవీకి...

మ‌హేష్ హిట్ మూవీకి 14ఏళ్లు

By - Tupaki Desk
Update: 2018-08-18 17:30 GMT
మ‌హేష్ కెరీర్‌లో ఎన్నో హిట్లు - బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్లు - రికార్డ్ హిట్లు ఉన్నాయి. వీటిలో ప్ర‌థామ‌ర్థంలో మురారి - ఒక్క‌డు - పోకిరి చెప్పుకోద‌గ్గ‌వి. మ‌హేష్ మిడిల్ కెరీర్‌ లో కొన్ని వ‌రుస ఫ్లాప్‌ల‌లో న‌టించాడు. ట‌క్క‌రిదొంగ‌ - బాబి - నిజం - నాని ఇలా కొన్ని ఫ్లాపులు ఊపిరాడ‌నివ్వ‌లేదు. మ‌ధ్య‌లో ఒక్క‌డు ఆదుకున్నా.. ఆ వెంట‌నే రెండు డిజాస్ట‌ర్లు. నిజం - నాని పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చాయి. స‌రిగ్గా అలాంటి వేళ అత‌డిని ఆదుకోవ‌డం కోస‌మేనా? అన్న‌ట్టు ఓ సినిమా వ‌చ్చింది. అదే అర్జున్.

అప్ప‌ట్లో సిస్ట‌ర్ సెంటిమెంటుతో వ‌చ్చిన ఈ చిత్రం సైలెంట్ హిట్ కొట్టింది. అప్ప‌టికి తెలుగు జ‌నం ఇంకా సెంటిమెంటల్ ఫెలోస్‌ గానే ఉన్నారు. నాటి రోజుల్లో ఇప్ప‌టితో పోలిస్తే అన్న‌ద‌మ్ములు - అక్క‌జెల్లెళ్ల మ‌ధ్య అనుబంధాలు బ‌లంగా ఉండేవి. అందుకే ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియెన్ వోన్ చేసుకుని ఆద‌రించారు. కొన్ని ఫ్లాపుల మ‌ధ్య ఒక హిట్టు రావ‌డంతో మహేష్  ఊపిరి పీల్చుకున్నాడు.

ఇప్ప‌టికి అర్జున్ సినిమా రిలీజై 14 సంవ‌త్స‌రాలైంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 18.08.2004లో రిలీజైంది. మ‌హేష్ స‌ర‌స‌న శ్రీ‌య క‌థానాయిక‌గా న‌టిస్తే, కీర్తిరెడ్డి సోద‌రి పాత్ర‌లో న‌టించారు. ప్ర‌కాష్‌రాజ్ కీల‌క పాత్ర పోషించారు. మ‌ధుర‌మీనాక్షి దేవాల‌యం సెట్ సినిమాకి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 9 కేంద్రాల్లో 100రోజులు ఆడిందీ సినిమా. హైద‌రాబాద్ - సంధ్య 35ఎంఎం - వైజాగ్ -జ్యోతి - విజ‌య‌వాడ - అన్న‌పూర్ణ‌ - కాకినాడ‌- దేవి - చీరాల - సాయి - తెనాలి- ర‌త్న‌ - ఏలూరు- అంబిక‌ - అమ‌లాపురం- వెంక‌ట‌ర‌మ‌ణ‌ - బండారు - శ్రీ‌కృష్ణ‌.. థియేట‌ర్ల‌లో అర్జున్ సినిమా శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుంది. ఆ విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు షేర్ చేసి సంబ‌రాలు చేసుకుంటున్నారు. 
Tags:    
  • Mahesh Babu 
  • Arjun Movie 
  • Telugu news 

Similar News

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS