• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వంశీ కోసం మహేష్ తారక్

వంశీ కోసం మహేష్ తారక్

By - Tupaki Desk
Update: 2019-04-09 05:09 GMT
ఏదో రాజమౌళి పుణ్యమా అని ఆర్ ఆర్ ఆర్ లాంటి క్రేజీ మల్టీ స్టారర్ పట్టాలు ఎక్కింది కాని బాలీవుడ్ తరహాలో ఒకే స్థాయి ఉన్న ఇద్దరు హీరోలు ఇక్కడ కలిసి సినిమాలు చేయడం చాలా అరుదు. అందుకే దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలా వెండితెర మీద మన స్టార్లను అదే పనిగా చూడాలని కోరుకోవడం పదే పదే జరిగే పని కాదు కాని ప్రైవేటు పార్టీస్ లో వీటి తాలుకు పిక్స్ భలే సందడి చేస్తాయి. పైన మీరు చూస్తున్న సెల్ఫీ కూడా అలాంటిదే.

మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి తన భార్య మాలిని బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పార్టీ ఇచ్చాడు. మహేష్ తో మూవీ రన్ అవుతోంది కాబట్టి భార్య నమ్రతా సమేతంగా విచ్చేశాడు. బృందావనం నుంచి మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తనూ సతీమణి ప్రనతితో పాటు విచ్చేశాడు. ఇంకేముంది పార్టీకి కొత్త కళ నిండుతనం వచ్చేశాయి

మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లు చివరిసారి ఒకే చోట కలుసుకున్నది భరత్ అనే నేను ప్రీ రిలీజ్ టైంలోనే. అప్పుడూ వీళ్ళతో వంశీ పైడిపల్లి ఉన్నాడు. మళ్ళి ఈ పార్టీలో ఈ కాంబో సాధ్యపడింది. సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉండే నమ్రతా ఈ సెల్ఫీని షేర్ చేసుకుంది. డార్క్ లైట్ కాబట్టి స్పష్టత తగ్గింది కాని అక్కడ మహేష్ తారక్ మొహాల్లో ఉన్న వెలుగు ఆ లోటును కవర్ చేసేసింది.

మహర్షి ఫైనల్ బాలన్స్ పార్ట్ కోసం రెడీ అవుతున్న వంశీ పైడిపల్లి మహేష్ లకు ఈ నెల రోజుల సమయం చాలా కీలకంగా మారబోతోంది. మే 9 విడుదలలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి అన్ని పనులను అడిషనల్ టీంస్ ని పెట్టి మరీ పూర్తి చేసేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ రెస్ట్ పూర్తి చేసుకుని తిరిగి రాగానే అందులో జాయిన్ అవుతాడు. ఇప్పుడీ మహేష్ తారక్ ల స్పెషల్ సెల్ఫీ అభిమానుల మధ్య బాగా వైరల్ అవుతోంది
Tags:    
  • Mahesh Babu 
  • NTR 
  • Vamshi Paidipally 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS