#RRR కోసం సూపర్‌ స్టార్స్‌.. మెగాస్టార్స్‌??

Update: 2020-02-03 05:30 GMT
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నాడు. సినిమాకు క్రేజ్‌ ఎలా తీసుకు రావాలి.. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి.. సినిమా గురించి జనాల్లో ఏ విధంగా చర్చ తీసుకు రావాలి అనే విషయాలు జక్కన్న టీం కు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్బుతమైన ప్రమోషనల్‌ ఐడియాస్‌ తో జక్కన్న తన సినిమాలను ప్రమోట్‌ చేస్తూ ఉంటాడు.

ఇక ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను తెరకెక్కిస్తూనే మరో వైపు ఆ సినిమాకు అన్ని చోట్ల బజ్‌ క్రియేట్‌ అయ్యేలా ప్లాన్స్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఉత్తరాధి వారిని ఆకట్టుకునేందుకు ఆలియా భట్‌.. అజయ్‌ దేవగన్‌ లను ఈ చిత్రంలో నటింపజేస్తున్నాడు. తమిళ.. మలయాళ.. కన్నడ స్టార్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఇక ఈ చిత్రం విడుదల సమయంలో జనాల దృష్టిని ఆకర్షించేలా చేసేందుకు వాయిస్‌ ఓవర్‌ ను ఉపయోగించుకోవాలని జక్కన్న భావిస్తున్నాడు.

తెలుగులో మహేష్‌ బాబు తో.. హిందీలో అమితాబచ్చన్‌ తో.. తమిళంలో రజినీ కాంత్‌ లేదా సూర్యతో.. మలయాళం లో మోహన్‌ లాల్‌ తో.. కన్నడం లో సుదీప్‌ లేదా యశ్‌ తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఆయా భాషల్లో ఆయా సూపర్‌ స్టార్స్‌.. మెగాస్టార్స్‌.. స్టార్స్‌ వాయిస్‌ తో ఆరంభం అవ్వబోతుందట. హీరోల పాత్రల పరిచయాలు మరియు కథ పరిచయంను వాయిస్‌ ఓవర్‌ తో చెప్పించాలని జక్కన్న భావించి అందుకు చాలా బలమైన డైలాగ్స్‌ ను ప్రముఖ రచయిత తో రాయిస్తున్నాడట.
Tags:    

Similar News