• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబు 'AMB సినిమాస్'...

మహేష్ బాబు 'AMB సినిమాస్' ఐడియా ఎవరిదంటే..!

By - Tupaki Desk
Update: 2021-07-05 11:30 GMT
ఏసియన్ సినిమాస్ నారాయణ దాస్ కె.నారంగ్.. అగ్రగామి సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ ను స్థాపించి తనయుడు సునీల్ నారంగ్ సమర్పణలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబోలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. అక్కినేని నాగార్జున - ధనుష్ వంటి స్టార్ హీరోలతో పాటుగా పలువురు యువ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నారాయణ దాస్ నారంగ్.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా AMB సినిమాస్ ఐడియా తనయుడు సునీల్ దే అని.. ఎంత ఖర్చు అయినా గ్రాండ్ గా మల్టీప్లెక్స్ కడదామని చెప్పాడని.. దానికి సరేనన్నానని.. ఇంటీరియర్ మొత్తం భరత్ నారంగ్ చూసుకున్నాడని నారాయణ దాస్ తెలిపారు. AMB మాల్ కోసం మహేష్ బాబుతో చేతులు కలపడం గురించి మాట్లాడుతూ.. ''ఆ ప్రాపర్టీ ల్యాండ్ నాది. దాంట్లో మాల్ నిర్మించాలనేది సునీల్ ఉద్దేశ్యం. మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారు ఓసారి కలిసినప్పుడు ఈ బిజినెస్ లో 50% వాటా ఇవ్వమని కోరారు. నేను ముందు వద్దు అని చెప్పాను. కానీ తర్వాత సరే అని చెప్పాను. ఆమె 50% కొనుక్కుంది. అప్పటి నుంచి ఇద్దరం భాగస్వాములుగా కొనసాగుతున్నాం'' అని చెప్పారు.

అల్లు అరవింద్ ఇంట్రెస్ట్ చూపించడంతో అల్లు అర్జున్ తో కలసి థియేటర్ నిర్మించామని.. అలానే విజయ్ దేవరకొండ తో కలిసి మరో థియేటర్ కట్టామని నారాయణ దాస్ నారంగ్ అన్నారు. ఈ సందర్భంగా 'యమగోల' సినిమా గురించి చెబుతూ.. 30 లక్షలతో ఎన్టీఆర్ 30 కాల్షీట్స్ తో తీశారని.. రామారావు రెమ్యూనరేషన్ కూడా రూ.లక్ష లోపే ఉండేదని చెప్పుకొచ్చారు.
Tags:    
  • mahesh babu 
  • amb cinemas 
  • hyderabad 
  • movies 
  • tollywood movies 
  • amb mall 
  • Sunil Narang 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS