• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్విట్టర్ లో అరుదైన ఫీట్...

ట్విట్టర్ లో అరుదైన ఫీట్ సాధించిన మహేష్...!

By - Tupaki Desk
Update: 2022-10-28 12:36 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నటశేఖర కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్.. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు.. తనకంటూ అభిమాన ఘనాన్ని ఏర్పరచుకున్నాడు. మహేశ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా సినిమా చేయకుండానే జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని అందంతో.. 47 ఏళ్ళ వయసులోనూ పర్ఫెక్ట్ ఫిజిక్ మైయింటైన్ చేస్తున్న మహేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ లో మహేశ్ అరుదైన ఫీట్ సాధించారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్.. ఇప్పుడు ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సౌత్ ఇండియన్ యాక్టర్ గా నిలిచాడు.

లేటెస్టుగా ట్విట్టర్ లో మహేష్ బాబు ని అనుసరించే వారి సంఖ్య 13 మిలియన్లు దాటింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న మరో హీరో లేడని చెప్పాలి. 2010 ఏప్రిల్ లో మహేష్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసారు. ఇప్పటి వరకూ ఆయన 30 మందిని మాత్రమే అనుసరిస్తుండగా.. అందులో 10 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ప్రిన్స్ కు 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహేష్.. సినిమా విషయాలతో పాటు ఫ్యామిలీ - పర్సనల్ విషయాలు మరియు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవలే తన డిస్ప్లే పిక్చర్ మరియు హెడ్డర్ ను చేంజ్ చేశారు మహేష్. రాబోయే రోజుల్లో పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతున్న అగ్ర హీరో.. తన ఫాలోయింగ్ ని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

కెరీర్ పరంగాను కూడా మహేష్ బాబు గత కొన్నేళ్లుగా ఫుల్ ఫార్మ్ లో దూసుకెళ్తున్నారు. ఓవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నారు. ఆయన నటించిన 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' 'సర్కారు వారి పాట' వంటి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలానే సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించిన 'మేజర్' మూవీ లాభాలను తెచ్చిపెట్టింది.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత వీరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాసిని అండ్ హారిక బ్యానర్ పై రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. దీని తర్వాతి ప్రాజెక్ట్ కోసం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో మహేష్ జత కట్టనున్నారు. ఇది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • superstar 
  • Maheshbabu 
  • twitter 
  • SouthFilm 
  • Hero 
  • Trivikram 
  • SSMB28 
  • latestnews 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS