మహానాయకుడు ఫిక్స్ అయ్యాడు

Update: 2018-12-19 10:51 GMT
ఎట్టకేలకు అభిమానుల సందిగ్దత మధ్య ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు రిలీజ్ డేట్ లాక్ చేసేసారు. ఫిబ్రవరి 7 విడుదల తేదీతో ట్రైలర్ తాలూకు ప్రమోషన్ పోస్టర్ కూడా కొత్తగా వదిలారు. సో ఎప్పుడు వస్తుంది అనే అయోమయానికి బ్రేక్ పడిపోయింది. నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వదిలినప్పుడు జనవరి 24 అంటూ మహానాయకుడు గురించి ప్రస్తావించారు. అయితే సీక్వెల్ కు కేవలం రెండు వారాలు మాత్రమే వ్యవధి ఉంటే వసూళ్ల పరంగా ప్రభావం ఉంటుందన్న డిస్ట్రిబ్యూటర్ల మాటకు తలొగ్గి డేట్ మార్చే ఆలోచన ఉన్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి.

అందులోనూ జనవరి 25న విపరీతమైన పోటీ ఉంది. అందుకే చర్చలు సాగించిన అనంతరం ఫిబ్రవరి 7 లాక్ చేసారు. అయితే ట్రైలర్ రెండు కలిపి ఉంటుందా లేక కథానాయకుడు మహానాయకుడులకు విడివిడిగా కట్ చేసారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రేపు జరిగే వేడుకలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మహానాయకుడు పూర్తిగా రాజకీయ జీవితానికి సంబందించినది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన తాలూకు ఘటనలు మధ్యలో ప్రతిపక్షంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎదురుకున్న పరిణామాలు అన్ని చూపించబోతున్నారు.

అయితే మహాభినిష్క్రమణం మాత్రం ఇందులో ఉండకపోవచ్చనే టాక్ ముందు నుంచి ఉంది. ఎన్టీఆర్ చివరి క్షణాల తాలూకు సంఘటనలు కొంత ఇబ్బందిగా గురి చేసేవిగా ఉండటం వల్ల కేవలం ఎండింగ్ టైటిల్స్ లో ఆయన అంతిమ యాత్ర  ఒరిజినల్ ఫోటోలు వీడియో బైట్ల రూపంలో చూపించబోతున్నట్టు తెలిసింది. సో కథానాయకుడు జనవరి 9న దానికి నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ లోనే మహానాయకుడు ఫిబ్రవరి 7న నందమూరి అభిమానులను అలరించబోతున్నాయి
Tags:    

Similar News