• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆదివారం 'మహా సముద్రం'...

ఆదివారం 'మహా సముద్రం' వేడుక.. చీఫ్ గెస్ట్ గా పవన్..?

By - Tupaki Desk
Update: 2021-10-07 09:30 GMT
'Rx 100' సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''మహా సముద్రం''. ఈ మల్టీస్టారర్ లో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'మహా సముద్రం' ట్రైలర్ - పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు JRC కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగనుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ ఓకే అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నారట.

పవన్ కళ్యాణ్ ఫంక్షన్ కు వస్తే ఆ సినిమాకు వచ్చే క్రేజ్ ఓ రేంజ్ లో వుంటుంది. కాకపోతే 'రిపబ్లిక్' ఈవెంట్ లో పవన్ స్పీచ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇది ఏపీలో సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపిందనే టాక్ ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ 'మహా సముద్రం' వేడుకకు వస్తే పవన్ ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి. కాగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

'మహా సముద్రం' చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ దీనికి ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - కేజీయఫ్ గరుడ రామ్ - శరణ్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • Sharwanand 
  • Siddharth 
  • Aditi Rao Hydari 
  • maha samudram 
  • maha samudram pre release event 
  • maha samudram release date 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS