ప్రభాస్‌ మూవీలోనూ మధురవాణి పాత్ర

Update: 2020-08-16 10:10 GMT
ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ మూవీ మూవీలో హీరోయిన్‌ గా ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే ఎంపిక అయిన విషయం తెల్సిందే. దాంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ నటించబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మహానటి చిత్రంలోనూ కీర్తి సురేష్‌ తో పాటు సమంతను నాగ్‌ అశ్విన్‌ నటింపజేశాడు. మధురవాణి పాత్రలో సమంత నటించి మెప్పించింది. కీర్తి సురేష్‌ పాత్రతో పాటు మధురవాణి పాత్ర సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది.

మహానటి చిత్రంలో మధురవాణి ఒక జర్నలిస్ట్‌. ఆ పాత్రను సమంత చేసింది. సావిత్రి మధురవాణి పాత్రలకు కాంబో సీన్స్‌ లేకున్నా కూడా రెండు పాత్రలు కూడా నిలిచిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ తో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా మధురవాణి తరహా పాత్ర ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఆ పాత్ర తక్కువ సమయం కనిపించినా కూడా కథలో కీలకంగా ఆ పాత్ర ఉంటుందట. కనుక ఆ పాత్రకు గాను ప్రముఖ హీరోయిన్‌ ను నటింపజేయాలని నాగ్‌ అశ్విన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

నటిగానే కాకుండా తన అందంతో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ నివేదా థామస్‌ ను ఎంపిక చేసే యోచనలో ఉన్నారట. ఈమె తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపు దక్కించుకుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్‌ తో అశ్వినీదత్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలో సినిమను పట్టాలెక్కించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News