• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పొలం దున్నుతున్న సాఫ్ట్...

పొలం దున్నుతున్న సాఫ్ట్ వేర్ రైతన్న

By - Tupaki Desk
Update: 2019-05-12 05:01 GMT
డైరెక్టర్.. నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్.. ఆడియో కంపెనీ వోనర్.. ఇప్పుడు రైతు.. వ్వావ్ అంటున్నారు ఆయన్ని చూసి. రైతు కుటుంబం నుంచి వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా మారి.. అక్కడ ఉన్నత శిఖరాల్ని అధిరోహించి.. ఉపాధి కోరే నిరుద్యోగులకు కౌన్సిలర్ గా అవతరించి.. అటుపై సినీపరిశ్రమతో సాన్నిహిత్యం కోసం మధుర ఆడియో కంపెనీని ప్రారంభించి.. అలాగే ఒక సినీ మ్యాగజైన్ ని అడాప్ట్ చేసుకుని ఒకటేమిటి ఎన్నో చేశారు మధుర శ్రీధర్. ఎన్ ఐటీ (వరంగల్).. ఐఐటీ(మద్రాస్).. అత్యున్నత విద్యాభ్యాసం చేసిన ఆయన సినీపరిశ్రమలో కొనసాగడం ఓ కీలక మలుపు.

ఆయన జర్నీ గురించి తెలిసిందే. దర్శకుడయ్యారు.. నిర్మాతగా సినిమాలు తీశారు. పెట్టుబడులు పెట్టి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్నా తన అనుభవాల్ని నెమరు వేసుకుంటూ మునుముందు భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుని సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. స్నేహగీతం.. ఇట్స్ మై లవ్ స్టోరి.. మాయ.. లేడీస్ అండ్ జెంటిల్ మన్..  ఫ్యాషన్ డిజైనర్.. ఒక మనసు.. .. వీటన్నిటికీ నిర్మాత. ఆయన పయనం అలా అలా  సాగుతూనే ఉంది. మధురా శ్రీధర్.. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీ. ఏ ఫర్ అమెరికా.. ప్రియురాలు.. ఐ యామ్ నాట్ సచిన్ .. సంతాన ప్రాప్తిరస్తు చిత్రాల్ని నిర్మిస్తున్నారు. కేసీఆర్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ జర్నీలోనే ఇతర దర్శకుల సినిమాల్ని ఆయన ప్రశంసిస్తూ నిరంతరం టచ్ లో ఉంటున్నారు.

తాజాగా రిలీజైన మహేష్ .. వంశీ పైడిపల్లి చిత్రం మహర్షిపైనా ఆయన ప్రశంసలు కురిపించారు. రైతులపై జాలి చూపించాల్సిన అవసరం లేదు. గౌరవిస్తే చాలు.. అనే మంచి ఆలోచనతో చేసిన `మహర్షి` మనసును తాకింది అని మధుర శ్రీధర్ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యను పోస్ట్ చేశారు. ఆ ప్రయత్నం చేసిన మహేష్ .. వంశీ పైడిపల్లి బృందాన్ని ఆయన అభినందించారు. అలాగే తాను రైతన్నగా కాడి ఎత్తి దుక్కి దున్నుతున్న ఓ ఫోటోని ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దానికి ప్రతిగా మహేష్ నుంచి ఆన్సర్ వచ్చింది. మహర్షి బ్లాక్ బస్టర్ అవ్వడం అన్ని వేళలా స్పెషల్.. కానీ సినిమా మోటివ్ ప్రభావితం చేస్తే.. స్ఫూర్తి నింపితే.. ఆ ఫీలింగ్ కొలవలేనిది... రైతే రాజు.. వ్యవసాయం ఒక ఛాలెంజ్.. అంటూ ఎంతో ఎమోషనల్ గానే రిప్లయ్ ఇచ్చారు.
Tags:    
  • Madhura Sridhar 
  • Mahesh Babu 
  • Maharshi Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS