• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగ‌మ్మాయికి...

తెలుగ‌మ్మాయికి తెలుగమ్మాయి థాంక్స్‌

By - Tupaki Desk
Update: 2015-10-14 15:30 GMT
లీడ‌ర్ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యింది ప్రియా ఆనంద్‌. హైద‌రాబాదీ మూలాలున్న చెన్న‌య్ భామ‌గా ఈ అమ్మ‌డు అంద‌రికీ సుప‌రిచితం. ఆన్ లైన్ ప‌రిచ‌యాల‌తో తొలి సినిమా చాన్స్ ప‌ట్టేసిన ఈ భామ కాల‌క్ర‌మంలో చెప్పుకోద‌గ్గ సినిమాల్లో న‌టించింది. ఇటు తెలుగులో ఆశించిన కెరీర్ దొరక్క‌పోయినా, అటు త‌మిళ్‌ లో మాత్రం అద‌ర‌గొట్టేసింది. ఇప్ప‌టికీ అక్క‌డ బోలెడ‌న్ని ఛాన్సులున్నాయి ఈ అమ్మ‌డికి. అయితే ఈ తెలుగ‌మ్మాయి అనుకోకుండా మ‌రో తెలుగ‌మ్మాయికి సాయ‌ప‌డింది. ఆ సాయం చిన్నా చిత‌కా కాదు ఏకంగా ఓ సూప‌ర్‌ స్టార్ సినిమాలో ఛాన్స్ ఇచ్చింది. అందుకు స‌ద‌రు భామ తెగ ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతోంది.

అప్ప‌ట్లో చీక‌టిరాజ్యం కిస్సింగ్ పోస్ట‌ర్ సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ఆ రేంజులో కిస్సు పెట్టించుకున్న ఈ భామ ఎవ‌రు? అన్న డిష్క‌స‌న్ సాగింది. అయితే ఆ స‌స్పెన్స్ ఆ త‌ర్వాత చాలా కాలానికి ఓపెన్ అయ్యింది. ఆ లిప్‌ లాక్ వేసింది తెలుగ‌మ్మాయ్ మ‌ధుశాలిని. క‌మ‌ల్‌ ని ఆలింగ‌నం చేసుకుని ఘాటైన ముద్దిచ్చేసింది తెలుగ‌మ్మాయే అని క‌న్ఫ‌మ్ అయ్యింది. అస‌లు తెలుగ‌మ్మాయి మ‌ధుశాలినికి ఆ ఛాన్సెలా వ‌చ్చింది? అంటే ఆ వెన‌క మ‌రో తెలుగమ్మాయ్ ప్రియా ఆనంద్ సాయం వ‌ల్లే. ప్రియా త‌న పేరును స‌జెస్ట్ చేసింది. క‌మ‌ల్ మ‌ధుశాలిని పిలిచి మ‌రీ వెంట‌నే అవ‌కాశం ఇచ్చారు. అందుకు మ‌ధుశాలిని ప్రియాకి థాంక్స్ చెప్పింది. ఆల్‌ రౌండ‌ర్ - పెర్ఫెక్ష‌నిస్ట్ క‌మ‌ల్‌ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తాన‌ని ఈ అమ్మ‌డు ఎప్పుడూ ఊహించ‌లేదు. అందుకే ఇప్పుడిలా.. ఆనందంతో కేరింత‌లు కొడుతోంద‌న్న‌మాట‌!
Tags:    
  • Madhu Shalini 
  • Priya Anand 
  • Cheekati Rajyam Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS