• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాధవన్ రాకెట్రీ.. ఓటీటీలో...

మాధవన్ రాకెట్రీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

By - Tupaki Desk
Update: 2022-07-20 14:30 GMT
భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అతికొద్ది మంది టాప్ ఇండియన్ యాక్టర్స్ లో మాధవన్ ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా ఇటీవల కాలంలో విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంటున్నాయి. అయితే గతంలో ఎక్కువగా ప్రేమ కథలు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేసిన మాధవన్ ఇప్పుడు మాత్రం కథలు ఎంతో డిఫరెంట్ గా ఉంటే గానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

ప్రతి కథను కూడా అతను ఎంచుకుంటున్న విధానం మిగతా నటీనటులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. కేవలం సినిమాలతోనే కాకుండా విభిన్నమైన వెబ్ సిరీస్ లతో కూడా మాధవన్ ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్గా అతను చేసిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మంచి విజయాన్ని అందుకుంది.

స్వీయదర్శకత్వంలో మధువన్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల పెట్టుబడికి 45 కోట్ల వరకు లాభాలను అందించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఏదేమైనా కూడా మాధవన్ మరోసారి ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 1వ తేదీన థియేటర్స్ లో విడుదలైంది.

ఇక ఇప్పుడు జూలై 26వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయనుంది. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఇటీవల ఆఫీషియల్ గా ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఒక గెస్ట్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

అలాగే మరొక సౌత్ స్టార్ హీరో సూర్య కూడా అతిధి పాత్రలో కనిపించి ఎంతగానో మెప్పించాడు. మాధవన్ నటన ఈ సినిమాలో అద్భుతంగా నిలిచింది. అంతే కాకుండా అతను డైరెక్షన్ చేసిన విధానం కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఓటీటీ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • kannada 
  • staractress 
  • Madhavan 
  • Rocketry 
  • movie 
  • OTT 
  • amazonprime 
  • latestnews 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS