• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  MAA ఎన్నిక‌లు 2021...

MAA ఎన్నిక‌లు 2021 పోస్టల్ బ్యాలెట్ నియ‌మావ‌ళి

By - Tupaki Desk
Update: 2021-10-05 08:27 GMT
మూవీ ఆర్టిస్టుల (మా) ఎన్నికలు ఈనెల 10న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మంచు విష్ణు ప్యానెల్ .. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ మ‌ధ్య వార్ ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ప్ర‌చారం అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి `మా` ఎన్నిక‌లు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.

అంతేకాదు.. ఈసారి `మా` లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతిని అనుస‌రించ‌డం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నిబంధనలను ప్రకటించారు.

1. పోస్టల్ బ్యాలెట్ కోసం 60 ఏళ్లు పైబడిన సభ్యులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర శారీరక కారణాలు ఉన్నా సరే ధ‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

2. స్పీడ్ పోస్ట్,.. కొరియర్ లేదా ఏజెంట్ ద్వారా 2021 సెప్టెంబర్ 25 నుంచి 30 సెప్టెంబర్ 2021 మధ్య ఎన్నికల అధికారికి సాదా కాగితంపై దరఖాస్తు చేసుకోవాలి.

3. ఆ దరఖాస్తులో జీవిత సభ్యత్వ నెంబర్.. బ్యాలెట్ పేపర్ తప్పనిసరిగా పంపాల్సిన చిరునామా.. ఫోన్ నంబర్.. శారీరకంగా ఎందుకు అందుబాటులో లేకపోతున్నారో కారణం ప్రస్తావించాలి.

4. ఎన్నికల ప్రక్రియ సమగ్రత కోసం ఒక ఏజెంట్ ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తుదారులకు ప్రాతినిధ్యం వహించరు.

5. ఎన్నికల అధికారికి తిరిగి బ్యాలెట్ పత్రం వచ్చినప్పుడు అవునా కాదా అని నిర్థారించేందుకు అప్లికేషన్ పై ఉన్న సంతకం నమూనాగా తీసుకుంటారు.

6. ఎన్నికల అధికారి సరిచూసిన తర్వాత బ్యాలెట్ పత్రాలు.. ధృవీకరణ స్లిప్ లను దరఖాస్తుదారులకు నేరుగా 4 అక్టోబర్ 2021న లేదా స్పీడ్ పోస్ట్ \ బ్లూ కొరియర్‌ ద్వారా పంపిస్తారు.

7. సభ్యులు.. ఓటింగ్ సమ్మతిపై.. సీల్డ్ కవర్ లో బ్యాలెట్ పేపర్ లను ఆఫీస్ చిరునామాకు స్పీడ్ పోస్ట్ \ బ్లూడార్ట్ ద్వారా 09-10-2021 లోపు పంపవచ్చు. 09-10-2021 తర్వాత వచ్చిన ఓట్లు తిరస్కరించబడతాయి.

8. పోలింగ్ అనేది ఒక రహస్య ప్రక్రియ.. ఓటింగ్ పద్ధతి టిక్ మార్క్ ద్వారా రహస్య ఉల్లంఘన ఓట్ల రద్దుకు దారితీస్తుంది.

9. `మా`లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి ప్రవేశపెట్టడం వల్ల ఊహించని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరివైనా దరఖాస్తులు తిరస్కరించడం తీసుకోవడం వంటి విషయాల్లో తగిన విధంగా ఎన్నికల అధికారి వ్యవహరించాలి. న్యాయస్థానానికి సంబంధించిన ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు.

ఇత‌ర నిబంధ‌న‌లు...

1. ఒక అభ్య‌ర్థి ఒక పోస్టు కోసం మాత్ర‌మే పోటీ చేయాలి.
2. గ‌త క‌మిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ అయి ఉండి.. 50 శాతం కంటే త‌క్కువ మీటింగ్‌ల‌కు హాజ‌రైతే పోటీకి అన‌ర్హులు.
3. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేర‌ర్స్ గా ఉన్న వారు మా ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి.
4. అంద‌రూ క‌చ్చితంగా క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాలి
5. నామినేష‌న్ స‌మ‌ర్ప‌ణ‌.. ఓటింగ్ స‌మ‌యంలో మాస్కు త‌ప్ప‌నిస‌రి
6. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ స‌దుపాయం
7. 60 ఏళ్లు దాటిన వారికే పోస్టల్ బ్యాలెట్
8. పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్ అనుమ‌తి లేదు
Tags:    
  • Postal Ballot Regulations 
  • MAA elections 
  • MAA elections 2021 
  • Tollywood MAA elections 
  • Prakash raj 
  • Manchu Vishnu 

Similar News

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

Copyright @2026

Powered by Blink CMS