• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్లీవాలా: థమన్.. మరో...

దిల్లీవాలా: థమన్.. మరో ఎనర్జిటిక్ ట్యూన్

By - Tupaki Desk
Update: 2019-12-21 05:33 GMT
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'.  పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్..తాన్య హోప్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో ప్రచారకార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 'నువ్వు నాతో ఎమన్నావో' అంటూ రెట్రో స్టైల్ లో సాగేఒక పాటను రిలీజ్ చేశారు. ఆ పాట ఇప్పటికే సంగీత ప్రియులను మెప్పించింది.  తాజాగా ఈ సినిమా నుండి 'దిల్లివాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్.  'దిల్లివాలా' పాట కు సాహిత్యం అందించినవారు రామజోగయ్య శాస్త్రి.  పాడిన వారు ఆదిత్య అయ్యంగార్.. రాహుల్ నంబియార్.. గీతా మాధురి. "తరగని గని ఇతడు సుగుణములెన్నిటికో మమతల సిరి ఇతడు ప్రియతములెందరికో.. ఇరుకు గదిలో గగనమితడు ఇలను వదలని చలనమితడు మనకులాగే బ్రతుకు లాగే సగటు మనిషితడు.. దిల్లివాలా దిల్లివాలా" అంటూ సాహిత్యం సాగింది.   ఈ పాటకు థమన్ ఓ ఎనర్జిటిక్ ట్యూన్ అందించాడు. సాంగ్ ప్రారంభంలో.. మధ్యలో వచ్చిన ఇన్స్ ట్రుమెంటేషన్ చాలా ట్రెండీగా ఉంది.  ఈ ట్యూన్ కు తగ్గట్టే సింగర్స్ అందరూ ఫుల్ జోష్ లో పాడారు. మధ్య లో హిందీ లిరిక్స్ కూడా రావడం తో పాటకు డిఫరెంట్ ఫీల్ ఉంది.

ఇక పాట లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.  ఒక సగటు మధ్య తరగతి దిల్లి వ్యక్తి లాగా మాస్  రాజా కనిపించాడు.. నభ నటేష్ తో సరదాగా తిరిగే సీన్స్ అందంగా ఉన్నాయి.  ఆలస్యం ఎందుకు.. ఈ దిల్లివాలాను వినేయండి.. ఆ విజువల్స్ కూడా చూసేయండి.


Full View
Tags:    
  • Dilwala Lyrical Video 
  • Mass Raja Raviteja 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu Songs 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS