మరో లక్కీ బ్యూటీతో అఖిల్‌ లక్‌ టెస్ట్‌

Update: 2020-11-23 03:15 GMT
అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం తన నాల్గవ సినిమా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలో క్రేజీ.. లక్కీ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే తో అఖిల్‌ రొమాన్స్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో పూజా హెగ్డేకు లక్కీ బ్యూటీ అంటూ పేరు వచ్చింది. ఆమెతో నటించేందుకు స్టార్స్ సైతం ఆసక్తిగా ఉన్నారు. ఆమె క్రేజ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ కు ఖచ్చితంగా ఉపయోగదాయకంగా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్‌ గా రష్మిక మందన్న కూడా ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెండ్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు.

ఈ ఏడాది మహేష్‌ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడంతో పాటు నితిన్‌ భీష్మ సినిమాలో నటించి సక్సెస్‌ ను దక్కించుకుంది. ఇప్పుడు పుష్ప సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమెతో అక్కినేని హీరో అఖిల్‌ తన 5వ సినిమాలో రొమాన్స్ కు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సురేందర్‌ రెడ్డి దర్వకత్వంలో అఖిల్‌ 5 కన్ఫర్మ్‌ అంటూ వార్తలు వచ్చాయి.

త్వరలో ప్రారంభం కాబోతున్న ఆ సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ షూటింగ్‌ పూర్తి అయితే వచ్చే ఏడాది ఆరంభంలోనే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాకపోవడంతో అఖిల్‌ లక్కీ బ్యూటీస్ తో తన లక్‌ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అఖిల్‌ కు లక్‌ ను తెచ్చి పెడతారా అనేది చూడాలి.
Tags:    

Similar News