అజ‌య్ భూప‌తి ఈ సారి గ‌ట్టిగా కొట్టేస్తాడా?

అంతే కాకుండా ఈ సినిమాపై త‌న‌కున్న ప్రేమ‌ని చాటుకుంటూ ఆసక్తిక‌రంగా స్పందించాడు. `ఈ క‌థ ప‌ట్ల ద‌ర్శ‌కుడిగా నేను పొందుతున్న అనుభూతి మునుపెన్న‌డూ లేనిది.;

Update: 2025-12-25 01:30 GMT

`Rx 100` సినిమాతో ప్రేమ క‌థా చిత్రాల్లో క‌ల్ట్ క్లాసిక్‌ని అందించాడు అజ‌య్ భూప‌తి. తొలి ప్ర‌య‌త్నంగా చేసిన ఈ మూవీ బ్ల‌క్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. రెండేళ్ల క్రితం `మంగ‌ళ‌వారం` మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న అజ‌య్ భూప‌తి త‌న త‌దుప‌రి మూవీ కోసం రెండేళ్లు నిరీక్షించాడు. `మంగ‌ళ‌వారం సూప‌ర్ హిట్ అనిపించుకున్నా స‌రికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని మ‌రోసారి ప్రేమ‌క‌థ‌నే న‌మ్ముకున్నాడు.

ఈ మూవీ ద్వారా మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్ వార‌సురాలు ర‌షా త‌డానీ ఈ మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. చంద‌మామ క‌థ‌లు పిక్చ‌ర్స్ ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్‌పై భారీ చిత్రాల ప్రొడ్యూస‌ర్ సీ.ఆశ్వ‌నీద‌త్ స‌మ‌ర్ప‌ణ‌లో పి. కిర‌ణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీ‌నివాస మంగాపురం` అనే టైటిల్‌ని ఇటీవ‌లే ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టైటిల్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ప్రీలుక్‌ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

శేషాచ‌లం కొండ‌ల నేప‌థ్యంలో సాగే య‌దార్ధ ప్రేమ‌క‌థ‌గా దీన్ని రూపొందిస్తున్నారు. య‌దార్థ ప్రేమ‌క‌థ ఆధారంగా `Rx 100`ని తెర‌కెక్కించి క‌ల్ట్ క్లాసిక్‌గా మార్చిన అజ‌య్ భూప‌తి `శ్రీ‌నివాస మంగాపురం`ని కూడా అదే స్థాయిలో మ‌లుస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. జీవి ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఎక్సైటింగ్ అప్ డేట్స్‌ని కూడా అందించ‌బోతున్నామ‌ని ద‌ర్శ‌కుడు అయ్ భూప‌తి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

అంతే కాకుండా ఈ సినిమాపై త‌న‌కున్న ప్రేమ‌ని చాటుకుంటూ ఆసక్తిక‌రంగా స్పందించాడు. `ఈ క‌థ ప‌ట్ల ద‌ర్శ‌కుడిగా నేను పొందుతున్న అనుభూతి మునుపెన్న‌డూ లేనిది. నిజంగా ఇది అద్భుతం. నాకు ఇందులోని పాత్ర‌లు, న‌టీన‌టుల న‌ట‌న అంటే చాలా ఇష్టం. నేను ప్రేమించే వ్య‌క్తుల‌తో చేసిన ప్ర‌యాణం, నా హృద‌యానికి ద‌గ్గ‌రైన కార‌ణంగా శ్రీ‌నివాస మంగాపురం` నాకు చాలా ప్ర‌త్యేకమైన‌ది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఎక్సైటింగ్ అప్ డేట్స్‌ని అప్‌డేట్‌లని అందించ‌బోతున్నాను. వాటి కోసం ఎదురుచూడండి` అంటూ పోస్ట్ పెట్టారు.

అజ‌య్ భూప‌తి ఉత్సాహం చూస్తుంటే ఈ సారి గ‌ట్టిగానే కొట్టేలా ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. సున్నిత‌మైన భావోద్వేగాల నేప‌థ్యంలో య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ‌క‌థతో మ‌ళ్లీ అజ‌య్ భూప‌తి మ‌రో క‌ల్ట్ క్లాసిక్‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయం అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌బోతున్న అజ‌య్ భూప‌తి ఎలాంటి స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నాడో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News