ఆర్ఎఫ్ సీలో ముంబై కమీషనర్ బయోపిక్!
తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబై నుంచి రామోజీఫిలిం సిటీకి షిప్ట్ అయింది. హైదరాబాద్ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు.;
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కథానాయకుడిగా కాఫ్ సంచలనం రోహిత్ శెట్టి మరో పోలీస్ స్టోరీని తెరకెక్కిస్తోన్న ంసంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. ముంబై స్టూడియోల్లో..రియల్ లోకేషన్స్ లో కొన్ని కీలక సన్ని వేశాలు చిత్రీకరించారు. రియల్ లోకేషన్స్ లో షూటింగ్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ముంబై మాజీ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్ కావడంతో? వీలైనంతగా వాస్తవికతను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే రోహిత్ రియల్ లొకేష్‌న్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబై నుంచి రామోజీఫిలిం సిటీకి షిప్ట్ అయింది. హైదరాబాద్ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు. ఇందులో కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కమీషనర్ రౌడీలను తరిమి కొట్టే సన్నివేశాలు ఆద్యంతం అలరించనున్నాయని, రెగ్యులర్ ఛేజింగ్ సన్నివేశాలకు అవి భిన్నంగా ఉంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. జాన్ అబ్రహం సహా ప్రధాన పాత్రధారులంతా షూట్ లో పాల్గొంటున్నారు. ఇంకా సినిమాలో యాడ్ అవ్వాల్సిన నటీన టులు మరికొంత మంది ఉన్నారు.
వారి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని రోహిత్ శెట్టి తన మునుపటి యాక్షన్ చిత్రాలకంటే? భారీ చిత్రంగా మలుస్తున్నట్లు చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. రాకేష్ భార్య ప్రీతి పాత్రలో ఎవరు నటిస్తారు? అన్న దానిపై కొంత సస్సెన్స్ నెలకొన్నప్పటికీ ఆ పాత్రకు మిల్కీబ్యూటీ తమన్నాను ఎంపిక చేసారు. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీలకమైనది. ఎందుకంటే రాకేష్ కెరీర్ కి ప్రీతి మూల స్థబంలా నిలబడ్డారు. ఉగ్రవాదుల నుంచి నగరాన్ని రక్షించడంలో తన భర్తకు ఎంతో తోడుగా నిలిచారు.
అలాగే సినిమాకు ఇంకా ఎలాంటి టైటిల్ నిర్ణయించలేదు. రాకేష్ మారియా కథ కావడంతో? ఆయన పేరుతోనే టైటిల్ ఉంటుందా? కొత్త టైటిల్ పెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. తమన్నా -జాన్ అబ్రహం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇద్దరు జంటగా `వేద` అనే సినిమాలో నటిం చారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ క్రేజీ జోడీగా మారిపోయారు. ఆ కాంబినేషన్ కి మంచి గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలోనేరాకేష్ మారియా కథలోనూ రోహిత్ శెట్టి రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చేస్తున్నాడా? లేదా? అన్నది చూడాలి. రోహిత్ శెట్టి గత సినిమా `సింగం రిటర్న్స్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో వంద శాతం సక్సెస్ అవ్వలేదు. కాఫ్ స్టోరీలోకి స్టార్ నటుల్ని రంగంలోకి దించినా? వర్కౌట్ అవ్వలేదు.