నవ్వినా లిప్‌స్టిక్ తుడిచినా ట్రోలింగే!

అలియా భట్ నేడు గ్లోబల్ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ద‌క్కించుకున్న న‌టి. బాలీవుడ్ న‌వ‌త‌రం న‌టీమ‌ణుల్లో అత్యంత వేగంగా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన న‌టిగానూ ఆమెకు గుర్తింపు ఉంది.;

Update: 2026-03-16 05:23 GMT

అలియా భట్ నేడు గ్లోబల్ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ద‌క్కించుకున్న న‌టి. బాలీవుడ్ న‌వ‌త‌రం న‌టీమ‌ణుల్లో అత్యంత వేగంగా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన న‌టిగానూ ఆమెకు గుర్తింపు ఉంది. ఎంతో ప్ర‌తిభావంతు రాలు కూడా. చిన్న వ‌య‌సులో? ఎంత మాత్రం ప్ర‌యోగాల‌కు వెనుకాడ‌కుండా ప‌ని చేస్తోంది. అయితే అమ్మ‌డు ఎంతగా ఎదుగుతుందో? అంత‌కంత‌కు సోషల్ మీడియాలో సొగ‌స‌రిపై ట్రోలింగ్ కూడా పెరుగుతోంది. తాజాగా బాఫ్టా వేడుకలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు , గతంలో తన భర్త రణబీర్ కపూర్ గురించి చెప్పిన విషయాలను నెటిజన్లు మరోసారి తెరపైకి తెస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అలియా ఏం చేసినా? ఎలా మాట్లాడినా అందులో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్ల తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాఫ్టా వేడుకలో `గాన్ గర్ల్` సినిమాలోని ఒక ప్రసిద్ధ మోనోలాగ్ గురించి ప్రస్తావించినప్పుడు? అలియా ఒక క్షణం తడబడటాన్ని కొందరు నెటిజన్లు ఓ నేరంగా చిత్రీకరిస్తున్నారు. దశాబ్దం క్రితం వచ్చిన సినిమాలోని సంభాషణలను అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోలేకపోవడం సహజమని విశ్లేషకులు చెబుతున్నా? ట్రోలర్లు మాత్రం ఆమెను టార్గెట్ చేయడం ఆపడం లేదు.

ఒక అంతర్జాతీయ వేదికపై భారతీయ నటిగా ఆమె సాధించిన ఘనతను పక్కన పెట్టి ఇలాంటి చిన్న విషయాలను భూతద్దంలో చూపడం వారి అసూయకు నిదర్శనమని అభిమానులు మండిప‌డుతున్నారు. అలాగే రణబీర్ కపూర్ విషయంలో కూడా అలియాను నెటిజన్లు విడిచి పెట్ట‌లేదు. ఓ ఇంటర్వ్యూలో రణబీర్‌కు తన సహజమైన పెదవుల రంగు అంటేనే ఇష్టమని? అందుకే లిప్‌స్టిక్ తుడుచుకోమని చెబుతుంటారని ఆమె సరదాగా పంచుకున్నారు. దీనిని పట్టుకుని రణబీర్‌ను ఒక రెడ్ ఫ్లాగ్ అని ఆయన ఆమెను నియంత్రిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కూడా సామాజిక సమస్యగా మార్చడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం మాటల మీదనే కాకుండా? అలియా చేసే సామాజిక స్పృహ కలిగిన పనుల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. మకర సంక్రాంతి సమయంలో పక్షుల సంరక్షణ గురించి ఆమె చేసిన పోస్ట్‌ను కపటత్వంగా కొందరు అభివర్ణించారు. ఆమె లెదర్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు జంతువుల గురించి మాట్లాడే హక్కు లేదంటూ విమర్శించారు. ఒక నటిగా ఆమె చేసే వృత్తిని, ఒక వ్యక్తిగా ఆమెకు ఉండే సామాజిక బాధ్యతను వేరు చేసి చూడలేకపోవడం కొంద‌రి సంకుచిత స్వభావానికి అద్దం పడుతోంది.

Tags:    

Similar News