'గుర్తుందా శీతాకాలం'లో తమన్నాకి తోడుగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు..?
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతున్న మూవీ ''గుర్తుందా శీతాకాలం''. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించారు. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'గుర్తుందా శీతాకాలం'లో తమన్నా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. 'లై' 'చల్ మోహన్ రంగ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేఘా ఆకాష్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందట. అలానే పలు కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటించిన కావ్య శెట్టి ని కూడా హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.
కాగా, 'గుర్తుందా శీతాకాలం' సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ దీనిపై చాలా వదంతులు వినిపించాయి. ఈ సినిమా కోసం మొదట తక్కువ రెమ్యునరేషన్ మాట్లాడుకున్న సత్యదేవ్.. ఆ తరవాత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అలానే స్టార్ హీరోయిన్ తమన్నా భారీగా డిమాండ్ చేస్తోందని.. దానికి ఒప్పుకుంటేనే సెట్స్ లో అడుగుపెడతానని అంటోందని టాక్ వచ్చింది. ఇదే సమయంలో సత్యదేవ్ 'తిమ్మరుసు' అనే మరో సినిమా స్టార్ట్ చేయడంతో 'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే చిత్ర యూనిట్ ఇటీవల క్యాస్టింగ్ కాల్ ఇచ్చి ఈ సినిమా ఆగిపోలేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కెరీర్ కి ఈ సినిమా కీలకమనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు.