వారి ‘లవ్ స్టోరి’ క్రేజ్ మామూలుగా లేదుగా
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకుని ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈయన ఏ సినిమా చేసినా కూడా ఓవర్సీస్ ప్రేక్షకులు ఆధరిస్తూనే ఉన్నారు. ఫిదా చిత్రం ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘లవ్ స్టోరి’పై అందరి దృష్టి ఉంది.
నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ లాక్ డౌన్ లేకుంటే ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అయ్యేదని సమాచారం. సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను అన్ని బాగుంటే జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను ఓవర్సీస్ లో పంపిణీ చేసేందుకు పలువురు బయ్యర్లు ఆసక్తి చూపిస్తూ భారీ రేటును ఆఫర్ చేస్తున్నారు.
ఇక శేఖర్ కమ్ముల సినిమాలకు శాటిలైట్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే లవ్ స్టోరి సినిమాను ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్టుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం భారీగా రేటును ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్మాణంలోకి అడుగు పెట్టింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇంకా పాట సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచాయి. కనుక లవ్ స్టోరీ సినిమా భారీ మొత్తాలకు అమ్ముడు పోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంతో నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ను కూడా దక్కించుకోబోతున్నట్లుగా అక్కినేని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.