ఆ లోటు పూడ్చాలి సుస్వరాల సుపుత్రా!
సంగీతం అనగానే ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ పేరు గుర్తుకు వస్తుంది. అంతకంటే ముందు ఎందరో గొప్ప సంగీత దర్శకులు ఉన్నా ఇళయరాజా నే అభిమానులు తలుచుకుంటారు. ఆ ఇద్దరికే అంత గొప్ప స్థానం ఎందుకు? అంటే .. సమకాలికుల్లో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచారు కాబట్టి. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని ఆశ్రయించి .. ట్యూన్ పరంగా వైవిధ్యాన్ని అందించారు కాబట్టి ఆ గుర్తింపు.
ఆ తర్వాతి జనరేషన్ లో ఎందరో సంగీత దర్శకులు గా దశాబ్ధాల పాటు కెరీర్ ని సాగించారు. మెలోడి బ్రహ్మగా మణిశర్మ పాపులరయ్యారు. ఇక ఇటీవలి కాలంలో దేవీశ్రీ ప్రసాద్- థమన్ (మణిశర్మ శిష్యుడు) మధ్య మాత్రమే పోటీ కొనసాగుతోంది. అయితే అంతకుమించి తెలుగులో సంగీత దర్శకులు పుట్టుకు రారా? అంటే ఇంతవరకూ ఎవరూ కనిపించడం లేదన్న విమర్శ అయితే ఉంది. ఎవరైనా ఉన్నా స్మాల్ టైమ్ కెరీర్ తప్ప సూటిగా దూసుకొచ్చిన యువకెరటాలు ఎవరూ లేరు. ఏళ్లకు ఏళ్లు కెరీర్ ని సాగించినా జనంలోకి వైరల్ గా దూసుకెళ్లిన పేర్లేవీ కనిపించలేదు.
అటు తమిళం లో యువన్ శంకర్ రాజా - హ్యారిస్ జైరాజ్ లాంటి సంగీత దర్శకుల పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే నవతరంలో ఇటీవల ఓ కొత్త పేరు తెలుగులో వినిపిస్తోంది. ఆయనే మహతి సాగర్. మణిశర్మ పుత్రరత్నం. ఛలో చిత్రంలో చూసీ చూడంగానే అంటూ అదిరి పోయే క్లాసిక్ సాంగ్ కి కంపోజ్ చేసిన అతడి భవిష్యత్ పై అంచనాలేర్పడ్డాయి. ఇటీవల భీష్మ పాటలతోనూ మరిపిస్తున్నాడు. వాటే బ్యూటీ... సింగిల్ ఆంథెమ్ .. సరా సరి పాటలు శ్రోతల్లోకి దూసుకెళ్లాయి. క్రియేటివిటీ కంటే క్లారిటీ అతడి మ్యూజిక్ కి ప్లస్ అన్న ప్రశంసా దక్కింది. అనవసర రణగొణ ధ్వనులు వినిపించకుండా చక్కని క్లారిటీ తో అతడి ట్యూన్ ఆకట్టుకుంటోంది. అందుకే అతడికి మునుముందు మంచి భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెహమాన్ - యువన్- హ్యారిస్ లాంటి సంగీత దర్శకులు ప్రతిసారీ వైవిధ్యం కోసం తపించారు. కొత్త ట్యాలెంటును పరిచయం చేశారు. స్వరంలో వైవిధ్యాన్ని చూపించారు. అందుకే అంత గొప్పగా ఎదిగారు. వారి స్ఫూర్తితో మహతి సాగర్ ఎదుగుతాడనే భావిద్దాం. కనీసం తండ్రికి తగ్గ తనయుడిగా మణిశర్మ తరహాలో పీక్స్ చూపిస్తాడేమో చూడాలి. తెలుగులో తెలుగు సంగీత దర్శకులెవరూ పుట్టుకురాని లోటును పూడ్చాలనే భావిద్దాం.