#లాక్ డౌన్ టెన్ష‌న్స్ నిర్మాత‌ల్లో గుబులు త‌గ్గాలంటే..?!

Update: 2021-03-30 03:30 GMT
ఈ స‌మ్మ‌ర్ లో వ‌రుస‌గా క్రేజీ చిత్రాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ తొలి వారంలో వ‌కీల్ సాబ్ రిలీజ‌వుతోంది. ఈ సీజ‌న్ లో అత్యంత క్రేజీగా రిలీజ‌వుతున్న చిత్ర‌మిది. ఆ త‌ర్వాత కూడా వ‌రుస‌గా నాగ‌చైత‌న్య‌.. నాని.. రానా లాంటి క్రేజు ఉన్న హీరోల సినిమాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

వ‌కీల్ సాబ్ మే తొలి వారంలో వ‌స్తుంది. త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల- చైత‌న్య కాంబినేష‌న్ మూవీ ల‌వ్ స్టోరి రిలీజ‌వుతుంది. అటుపై నాని- ట‌క్ జ‌గ‌దీష్.. రానా- విరాఠ ఫ‌ర్వం చిత్రాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. వీటితో పాటు త‌లైవా రిలీజ‌వుతోంది. అయితే ఈ సినిమాల రిలీజ్ వ్య‌వ‌హారం అంతా సాఫీగా సాగుతుందా? అంటే .. క‌రోనా టెన్షన్ భ‌య‌పెట్టేస్తోంది.

సెకండ్ వేవ్ ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెర‌గ‌డం ఇబ్బంది పెడుతోంది. మునుప‌టితో పోలిస్తే అవ‌గాహ‌న ఉన్నా కానీ ప్ర‌జ‌లు అజాగ్ర‌త్త‌గా ఉండ‌డంతో మ‌రోసారి పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల్ని జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందిగా హెచ్చ‌రించాయి. రెగ్యుల‌ర్ వార్తా బులెటిన్ల‌లో క‌రోనాకి ప్రాధాన్య‌త అమాంతం పెరిగింది. ఈ స‌న్నివేశంలో ఎలా ఉంటుందోన‌న్న ఆందోళ‌న టాలీవుడ్ లో ఉంది.

నిజానికి సినిమాలు రిలీజ్ కాక‌పోతే ఫ‌ర్వాలేదు కానీ రిలీజయ్యాక లాక్ డౌన్ స‌న్నివేశం ఉంటేనే ఇబ్బంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఇప్ప‌టికే క‌రోనా ప్ర‌జ‌ల మాన‌సిక స్థితిని ప్ర‌భావితం చేస్తోంది. మెట్రోల్లో ఇంకా టెన్ష‌న్ ఉంది. కానీ జ‌న‌జాగృతం అనేది ఎవ‌రికి వారు స్వీయ నియంత్ర‌ణ‌ నిబ‌ద్ధ‌త‌తో మాత్ర‌మే సాధ్య‌మ‌య్యేది. క‌నీసం ఇంత‌కుముందులా మాస్కులు విధిగా ధ‌రించి శానిటైజ‌ర్లు వెంట తీసుకుని వెళ్ల‌డం చాలా ముఖ్యం. అలాగే వ్యాక్సినేష‌న్ అందుబాటులో ఉంది కాబ‌ట్టి త్వ‌ర‌గా అది పూర్త‌యినా కొంత‌వ‌ర‌కూ క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆస్కారం ఉంటుంది. జ‌నం సుర‌క్షితంగా ఉంటేనే అంతా బావుంటుంది. దాంతో పాటే టాలీవుడ్ బావుంటుంది. క‌రోనా కేసుల‌ను త‌గ్గించి ప‌రిస్థితిని అదుపులో ఉంచ‌డం అంద‌రి బాధ్య‌త‌. అప్పుడే అందరికీ మ‌నుగ‌డ‌.
Tags:    

Similar News