వేదం పోరి.. వేదాలే వేదాలు

Update: 2015-06-09 17:30 GMT
వేదం చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైంది చెన్నయ్‌ పోరి లేఖ వాషింగ్టన్‌. రాక్‌స్టార్‌ మనోజ్‌తో పోటీపడి రాక్‌ బ్యాండ్‌ సభ్యురాలిగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తర్వాత లేఖకు తెలుగులో వరసగా అవకాశాలొస్తాయనే అనుకున్నారంతా. కానీ ఎందుకనో అనుకున్న స్థాయిలో అవకాశాలే రాలేదు.

తమిళంలోనే ఓ అరడజను సినిమాల్లో నటించిన ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. అరిమా నంబి, జయం కొండాన్‌, క్వార్టర్‌ కట్టింగ్‌ లాంటి సినిమాల్లో నటించి తంబీల్ని అలరించింది. వాస్తవానికి లేఖ సినిమాల్లో నటించకముందు ఓ టీవీ యాంకర్‌. సన్‌ నెట్‌వర్క్‌లో పనిచేసేది. అనూహ్యంగా నాయికగా అవకాశం వచ్చింది. కానీ పెద్ద స్టార్‌ హీరోయిన్‌ కాలేకపోయింది. ఇదే విషయాన్ని తనవద్ద ప్రస్తావిస్తే మాత్రం వేరే కథ వినిపిస్తోంది. నాకు రొటీన్‌ మూస పాత్రల్లో నటించే అలవాటు లేదు. విక్రమ్‌ తరహాలోనే విలక్షణమైన పాత్రల్లో నటించాలని అనుకుంటా. అలాంటి పాత్రలేవైనా వస్తేనే చేస్తాను.. అయినా ముంబైలో ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్స్‌ సంస్థను స్థాపించి బిజీగా ఉన్నానని చెప్పింది.

లేఖ తలబిరుసు సమాధానం వింటుంటే ఓ సామెత గుర్తొస్తోంది కదూ.. ఉట్టికెక్కలేనమ్మ ఊరికేగిందిట. అలా ఉంది వ్యవహారం. ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నా. అలాగే నాకో బోయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. అతడితో ప్రేమలో ఉన్నానని చెప్పింది లేఖ.



Tags:    

Similar News