లక్స్ మీ బాంబ్ ని ఫిక్స్ చేశారు

Update: 2019-05-18 06:50 GMT
లారెన్స్ కి కనక వర్షం కురిపించే కామధేనువుగా మారిన ముని సిరీస్ హారర్ బంచ్ మీద ఇతర బాషా హీరోలు కూడా మనసు పారేసుకుంటున్నారు. రెండో భాగం కాంచన మన దగ్గర వచ్చి మూడేళ్లు దాటింది కానీ ఇప్పటికీ దాని రీమేకులు జరుగుతూనే ఉన్నాయి. కన్నడలో ఉపేంద్ర చేసి అక్కడా సక్సెస్ కొట్టాడు. తాజాగా ఇప్పుడు హిందీ వంతు వచ్చింది.

అక్షయ్ కుమార్ హీరోగా ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనికి లక్స్ మీ బాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లారెన్స్ పోషించిన పాత్రను ఇందులో అక్షయ్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది జూన్ 20న దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అక్షయ్ కుమార్ స్వయానా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ డేట్ ఇంకా సంవత్సరం పైగా టైం ఉంది. బాలీవుడ్ లో ఇలా తేదీలు ముందుగానే ఫిక్స్  చేసుకోవడం సహజం.

భరత్ అనే నేను-వినయ విధేయ రామలతో మనకు చేరువైన కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హిజ్రా పాత్ర ఎవరు చేస్తారు అనేది సస్పెన్స్ లో పెట్టారు. అమితాబ్ బచ్చన్ అనే టాక్ ఉంది కానీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అన్నట్టు ఇదే టైటిల్ తో మంచు లక్ష్మి ఓ సినిమా చేసింది కానీ అది ఎవరూ పట్టించుకోలేనంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అది వేరే విషయం కాని టైటిల్ ఒకటే కావడం తో ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది.


Tags:    

Similar News