భోరుమన్న తమిళ హీరో

Update: 2017-01-23 10:14 GMT
జల్లికట్టుపై విధించిన నిషేదాన్ని వ్యతిరేకిస్తూ తమిళులు చేసిన ఉద్యమం ఏస్థాయిలో జరిగిందో తెలిసిందే. ఎవరూ నాయకత్వం వహించకుండానే లక్షలాది మంది తమిళ యువత రోడ్ల మీదకు రావటం ఒక ఎత్తు అయితే.. చెన్నై మెరీనా బీచ్ లో వారు చేపట్టిన ఆందోళన దేశం మొత్తాన్ని ఆకర్షించింది.ఈ ఆందోళనలకు తమిళ చిత్రసీమ మొత్తం అండగా నిలిచింది.మిగిలిన నటుల సంగతి ఎలా ఉన్నా.. నృత్యదర్శకుడు కమ్ హీరో అయిన లారెన్స్ రూ.కోటి మొత్తాన్ని నిరసనకారుల కోసం ఇవ్వటం పెద్ద వార్తగా మారింది.

అయితే.. తీవ్రమైన అనారోగ్యంతో నిరసనలో పెద్దగా పాల్గొనని ఆయన.. చివరకు ఆసుపత్రిలో చేరారు. ఇదిలా ఉంటే.. సోమవారం ఉదయం నుంచి మెరీనా బీచ్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తీవ్రంగా కలత చెందారు. ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు విరుచుకుపడటం.. అందుకుప్రతిగా కొందరు ఆందోళనకారుల తీరుతో ఉద్యమం తీరుతెన్నులు మొత్తంగా మారిపోయిన సంగతి తెలిసిందే.

మెరీనా బీచ్ నుంచి తనకు ఒక మహిళఫోన్ చేసి టీవీ చూడాలని చెప్పిందని.. వెంటనే టీవీ ఆన్ చేస్తే.. పోలీసుల తీరుతో బీచ్ లోని యువత ఎంత భయాందోళనలతో కనిపించారని.. వెంటనే తాను అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించానని.. పోలీసులు తనను అనుమతించలదేన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో మెరీనా బీచ్ వద్దకు వస్తానన్న లారెన్స్.. ఆందోళనకారులంతా శాంతియుతంగా ఉండాలని.. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. తన సందేహాన్ని వీడియో రూపంలో చేసిన లారెన్స్.. మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు. పోలీసుల తీరుతోసముద్రంలోకి దిగి యువత ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పటం తనను తీవ్రంగా కలిచివేస్తోందని వాపోయారు. లారెన్స్ వీడియోఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News