• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అను రాయ‌పాటి @ అందాల...

అను రాయ‌పాటి @ అందాల రాక్ష‌సి

By - Tupaki Desk
Update: 2015-12-15 04:53 GMT
అందాల రాక్ష‌సి అంటే మ‌న లావ‌ణ్య త్రిపాఠి అని కాస్త సినీ ప‌రిజ్ఞానం ఉన్న ఏ తెలుగు ప్రేక్ష‌కుడైనా ఇట్టే  చెప్పేస్తాడు. మ‌రి ఈ అను రాయ‌పాటి ఎవ‌రు?  నిజంగా ఈ పేరు కొత్త‌గా వినిపిస్తోంది క‌దూ!  త్వ‌ర‌లోనే తెలుగు తెర‌పై సంద‌డి చేయ‌బోతున్న పాత్ర పేర‌ది. ఆ పేరుతోనే అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌బోతోంది. ఆ విష‌యాన్ని క‌థానాయ‌కుడు అల్లు శిరీష్ బ‌య‌ట‌పెట్టాడు.

సోలో ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా  ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. అందులో క‌థానాయిక‌గా లావ‌ణ్య న‌టిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు అను రాయ‌పాటి అట‌. బాగా అల్ల‌రి చేసే పాత్ర అని స‌మాచారం. కాలేజ్ గోయింగ్ గాళ్‌ గా క‌నిపించ‌బోతోంద‌ట‌. లావ‌ణ్య ఈ రోజు త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆమె పాత్ర పేరును బ‌య‌ట‌పెడుతూ అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ఈ పేరులో మంచి రైమింగే క‌నిపిస్తోంది. అదే రైమింగ్ పాత్ర‌లోనూ వ‌ర్క‌వుట్ అయితే లావ‌ణ్య‌కి మ‌రో హిట్టు ద‌క్కిన‌ట్టే. 

అయితే లావ‌ణ్య త‌న బ‌ర్త్ డే ఇంట‌ర్వ్యూల్లో శిరీష్ సినిమాలోని  పాత్ర గురించి చెప్ప‌లేదు కానీ... ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది అనే సినిమాలోని పాత్ర  గురించి మాత్రం చాలా చెప్పింది. ఇంత‌కీ అందులో లావ‌ణ్య పాత్ర పేరేంటో తెలుసా? ఆంకాళ‌మ్మ. లావ‌ణ్య‌లాంటి అంద‌గ‌త్తెకి అదేం పేరంటారా?  అదే విష‌యాన్ని అడిగితే ``అందులోనే ఉంది గ‌మ్మ‌త్తు`` అంటూ న‌వ్వేసింది లావ‌ణ్య‌. ఆ సినిమాలో మొత్తం మూడు ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపిస్తాన‌ని చెప్పుకొచ్చిందామె. 
Tags:    
  • Lavanya Tripati 
  • Allu Sirish 
  • Telugu NEws 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS