• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వినాయక్-తేజు సినిమాలో ఆమె

వినాయక్-తేజు సినిమాలో ఆమె

By - Tupaki Desk
Update: 2017-08-10 07:04 GMT
చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న కాంబినేషన్ ఓకే అయింది. ఎట్టకేలకు పట్టాల మీదికి వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మాణంలో సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. తేజు తొలిసారి ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండటం.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వినాయక్ చేస్తున్న ఈ సినిమా ఇది కావడంతో దీనిపై జనాల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ అందించాడు. ఈ చిత్రానికి ‘దుర్గ’ అని.. ‘ఇంటలిజెంట్’ అని రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

సినిమా ప్రారంభోత్సవం రోజు కథానాయిక.. ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల సంగతి వెల్లడించలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుందట. ఆమె తేజు.. వినాయక్ లతో పని చేయబోతుండటం ఇదే తొలిసారి. రాధ.. మిస్టర్ లాంటి ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయినట్లు కనిపించిన లావణ్య.. ఈ మధ్య మళ్లీ బాగానే పుంజుకుంటోంది. రామ్ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న లావణ్య.. ఇప్పుడు వినాయక్-తేజుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం పట్టేసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుందట. ‘ఖైదీ నంబర్ 150’ ఎంత పెద్ద హిట్టయినప్పటికీ.. ఆ క్రెడిట్ వినాయక్ ఖాతాలోకి రాలేదు. అలాగే తేజు కెరీర్ కూడా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. లావణ్య పరిస్థితీ అంతే. కాబట్టి ఈ ముగ్గురికీ ఈ చిత్రం కీలకమే.
Tags:    
  • Lavanya Tripathi 
  • Vinayak 
  • Sai Dharam Tej 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS