• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పోకిరి' లక్షణాలతో నితిన్...

'పోకిరి' లక్షణాలతో నితిన్ 'జూనియర్'

By - Tupaki Desk
Update: 2022-03-01 12:30 GMT
 టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి నితిన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. వరుస పరాజయాలు ఎదురైనా గ్యాప్ ఇవ్వకపోవడం ఆయన కెరియర్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది.  ఆ మధ్య వచ్చిన 'భీష్మ' సినిమా తరువాత ఆయన హిట్ అనే మాట వినలేదు.

ఆ సినిమా తరువాత ఆయన చేసిన 'చెక్' .. 'రంగ్ దే' .. 'మాస్ట్రో' విజయానికి చాలా దూరంలో ఉండిపోయాయి. ఈ సినిమాలన్నీ ఆయనతో పాటు అభిమానులను కూడా నిరాశపరిచాయి.

ఈ నేపథ్యంలో ఆయన 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మిత మవుతోంది. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాల చుట్టూ ఈ కథ తిరగనుంది.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. 'రంగస్థలం' తరహాలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుగుతుండగానే నితిన్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. ఈ కొత్త ప్రాజెక్టు వక్కంతం వంశీ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

టాలీవుడ్ సినిమా రచయితలలో వక్కంతం వంశీకి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథలను అందించిన చాలా సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఒక త్రివిక్రమ్ .. కొరటాల మాదిరిగా దర్శకుడిగా మారడానికిగాను తొలి ప్రయత్నంగా 'నా పేరు సూర్య' సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా ఆయన రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తరువాత దర్శకుడిగా గ్యాప్ తీసుకున్న ఆయన, తన రెండవ సినిమాను నితిన్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కథ 'పోకిరి' .. 'కిక్' తరహాలో నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుందని అంటున్నారు. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది రెండవ సినిమా. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనీ .. ఇకపై దర్శక రచయితగానే కొనసాగాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి.  
Tags:    
  • Tollywood 
  • Younghero 
  • Nithin 
  • Newmovie 
  • Macharla Neyojaka Vargam 
  • Krithishetty 
  • Latestnews 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS