• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రకుల్ తెలివే తెలివి.. ఇలా...

రకుల్ తెలివే తెలివి.. ఇలా పులిహోర కలపటం ఎలా నేర్చావ్?

By - Tupaki Desk
Update: 2022-03-09 05:00 GMT
ఏదైనా విషయాన్ని హైప్ తీసుకురావటం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. చివరకు సెలబ్రిటీలు సైతం అదే బాటలో నడుస్తున్న వైనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. పెద్దగా చర్చకు రాని అంశాల్ని సైతం అందరూ మాట్లాడుకునేలా చేయటం కోసం వేస్తున్న ఎత్తుల్ని చూస్తే.. సదరు సెలబ్రిటీల మార్కెటింగ్ స్ట్రాటజీలకు పడిపోకుండా ఉండలేం. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

చేతినిండా సినిమాలు.. ఒక్క బాలీవుడ్ లోనే నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. వరుస సినిమాల్ని చేస్తోంది.తాజాగా ఆమె నటించి.. విడుదలకు సిద్ధమవుతున్న మూవీ ఛత్రివాలి. ఇందులో ఇప్పటివరకు చాలామంది వినని సరికొత్త పాత్రను చేస్తోంది రకుల్.  కండోమ్ టెస్టర్ గా బోల్డ్ పాత్రను చేస్తున్న ఆమె.. ఈ సినిమాతో తన గురించి అందరూ మాట్లాడతారని భావించినట్లుంది. అందుకు భిన్నంగా పరిస్థితి ఉండటంతో తానే సీన్లోకి వచ్చేసింది.

ఈ మధ్యనే షూటింగ్ పూర్తైన ఈ మూవీ.. ఇప్పుడు పోస్టు ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇలాంటి వేళ.. ఈ సినిమాకు హైప్ తెచ్చే బాధ్యతను రకుల్ తన భుజాల మీద వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కారణం.. తాజాగా ఈ మూవీ గురించి.. తన పాత్ర గురించి మాట్లాడిన మాటలు.. అవసరం లేకున్నా మధ్యలో తన తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చి పులిహోర కలిపిన తీరు.. చివర్లో దద్దోజనం మాటలతో ముగించిన తీరు చూస్తే.. ఈ సినిమా కోసం పక్కా మార్కెటింగ్ ఎత్తుగడను ప్రేక్షకుల మీద వదులుతోందన్న విషయం అర్థమవుతుంది.

ఈ సినిమా గురించి ఒక చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్.. తాను నటించిన కండోమ్ టెస్టర్ పాత్ర గురించి తన తల్లిదండ్రులకు చెప్పటం.. వారి స్పందన ఎలా ఉందన్న విషయాన్ని చెప్పేసిన వైనం చూస్తే.. అందరి అటెన్షన్ ను తానెంతలా కోరుకుంటుందన్న విషయాన్ని ఆమె చెప్పేశారని చెప్పాలి.  తాము కొత్త విషయాన్ని చెప్పటం లేదని.. ఎప్పటి నుంచో సమాజంలో ఉన్న దానిని సరికొత్త ప్రయత్నం చేసి ప్రేక్షకుల ముందుకు చూపెడుతున్నట్లుగా చెప్పింది.

జీతం కోసం మాత్రమే కండోమ్ టెస్టర్ ఉద్యోగంలో చేరిన ఒక అమ్మాయి.. అనంతరం దాని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుంటుందని.. దాంతో ఏం చేయాలో.. ఏం చేయకూడదో స్పష్టంగా తెలియాలని చెబుతోంది. అలా అని సినిమాలో అసభ్యతకు తావు లేని రీతిలో సినిమా ఉంటుందన్న ఆమె.. అందుకు భిన్నంగా ఉండే ఒక స్టేట్ మెంట్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. తాను పోషించిన కండోమ్ టెస్టర్ పాత్రలో అసభ్యత లేదని చెప్పిన రకుల్.. ‘‘వాస్తవానికి ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ పరంగా కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే.. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకే ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా’ అని రకుల్ చెప్పింది.

ఈ సినిమాలో పాత్ర గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని.. వారు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారన్నారు. అయితే.. తాను చేసే ప్రతి పాత్ర గురించి ఇంట్లో చెప్పి.. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ఓకే చెబుతానన్న రకుల్ మాటలు చూస్తే.. తల్లిదండ్రుల ప్రస్తావన.. కండోమ్ టెస్టర్ పాత్ర గురించి ఆమె చెప్పిన మాటలన్ని కూడా సినిమా హైప్ కోసమేనన్న విషయం అర్థమవుతుంది.

ఎందుకంటే.. సినిమాలో ఎలాంటి అసభ్యత ఉండదని చెప్పిన తర్వాత.. ఆమె పేరెంట్స్ ఈ సినిమా చేయటానికి నో చెప్పకుండా ఎస్ చెప్పటానికి ప్రత్యేక కారణమేమీ కనిపించదు. ఇదంతా చూస్తే.. సినిమాకు హైప్ క్రియేట్ చేసేందుకు వీలుగా పులిహోర కలిపే ప్రయత్నం చేశారు రకుల్. కాకుంటే.. ఆ విషయం అందరికి అర్థమయ్యేలా చెప్పేయటంతోనే ఇబ్బంది.  కాస్తంత తెలివిగా స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకుంటే బాగుండేదిగా రకుల్?
Tags:    
  • Rakulpreetsingh 
  • bollywood 
  • tollywood 
  • chhatriwali 
  • latestnews 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS