చైత‌న్య బాలీవుడ్ కెరీర్ ని లాల్ సింగ్ డిసైడ్ చేస్తాడు!

Update: 2022-07-20 23:30 GMT
యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కెరీర్ ప్రారంభ‌మై ద‌శాబ్ధం దాటింది. 13 ఏళ్ల‌  సినీ ప్ర‌యాణంలో ఎన్నో సినిమాలు చేసారు. స‌క్సెస్..ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా చైత‌న్య త‌న  బ్రాండ్ ని తెలుగు మార్కెట్ లో వేయ‌గ‌లిగాడు. అక్కినేని వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన చైత‌న్య  తాత‌య్య ఏఎన్నార్..తండ్రి నాగార్జున త‌ర‌హాలోనే ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ని ద‌క్కించుకున్నారు.

తాత‌కి త‌గ్గ మ‌న‌వ‌డిగా.తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా చైత‌న్య‌కి ఆ ర‌క‌మైన గుర్తింపు ప్రేక్ష‌కులు అనతి కాలంలోనే ఇచ్చారు. కొన్ని మాస్ సినిమాలు చేసిన‌ప్ప‌టికీ చైత‌న్య‌కి అవి పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. ఈ విష‌యాన్ని ఆయ‌నే న‌ర్మ‌గ‌ర్భంగా ఒప్పుకుంటారు. మాస్ హీరోగా వెనుక‌బ‌డ్డాను? అన్న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుంటారు. కానీ  వెండి తెర‌పై  అక్కినేని వార‌సుడిగా మాత్రం తానెప్పుడు విన్న‌ర్ గానే నిల‌బ‌డ్డారు.

అందులో ఎలాంటి సందేహం లేదు. ల‌వ‌ర్ బోయ్ అనే ఇమేజ్ కి ప‌ర్పెక్ట్ గా సూట‌య్యే హీరో చైత‌న్య‌. అందుకే క్రియేటివ్ కోలీవుడ్ మేక‌ర్స్ గౌత‌మ్ మీన‌న్..విక్ర‌మ్. కె. కుమార్ లాంటి వాళ్లు చైతో త‌న ఇమేజ్ కి త‌గ్గ ల‌వ్ స్టోరీలే  చేస్తుంటారు. ఆ ర‌కంగా చైత‌న్య అభిమానుల అంచ‌నాలు ఎప్పుడూ  త‌ప్ప‌లేదు. ఇప్పుడ‌దే ల‌వ‌ర్ బోయ్ 'లాల్ సింగ్ చ‌ద్దా'తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ తో తొలిసారి తెర‌ను పంచుకుంటున్నారు. అయితే ఈసినిమాలో  చైత‌న్య పాత్ర డిఫ‌రెంట్. సాహ‌సోపేత‌మైన సైనికుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తెర‌పై క‌నిపించేది కాసేపే అయినా చైత‌న్య పాత్ర కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని లాల్ సింగ్ టీమ్  ఇప్ప‌టికే ధీమా వ్య‌క్తం చేసింది.
Read more!

ఈ సినిమాతో చైత‌న్య‌కి కొత్త రక‌మైన గుర్తింపు ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఆ గుర్తింపు ఎలా ఉంటుంద‌న్న‌ది! రిలీజ్ త‌ర్వాత  ప్రేక్ష‌కాభిమానులు నిర్ణ‌యించాల్సి  ఉంటుంది. మ‌రి ఈ సినిమా గురించి...భ‌విష్య‌త్ బాలీవుడ్ కెరీర్ గురించి చైత‌న్య ఏమంటున్నాడంటే?  ''లాల్ సింగ్ త‌ర్వాత కొత్త‌గా హిందీ సినిమాలేవి ఒప్పుకోలేదు.

ముందు అక్క‌డి ప్రేక్ష‌కులు ఒప్పుకోవాలి. అప్పుడే హిందీలో సినిమాలు చేయాలా?  లేదా? అని డిసైడ్ అవుతా అన్నారు. అంటే ఇప్ప‌ట్లో చైత‌న్య హిందీ సినిమాల చేయాలంటే లాల్ సింగ్ విజ‌యం త‌ప్ప‌నిస‌రి. అందులో చైత‌న్య పాత్ర కి అనుకుంటున్న‌ట్లు గా గుర్తింపు దక్కాలి. ప్రేక్షకులు తెలుగు వాడు అన్న భావ‌న లేకుండా  స్వ‌భాషా న‌టుడిలా స్వీక‌రించాలి.

అలా జ‌రిగితేనే  చైత‌న్య కొత్త హిందీ ప్రాజెక్ లు ఒప్పుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే  హీరోలంతా పాన్ ఇడియా మార్కెట్ పై ప‌డుతున్నారు. యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్త‌న్నారు. వాటితో పాన్ ఇండియా  గుర్తింపు సుల‌భం అవుతుంద‌నే ఆలోచ‌న‌తో ముందుకు వెళ్తున్నారు. లాల్ సింగ్ లో చైత‌న్య పాత్ర‌కి  ఆఛాన్స్ చాలా ఎక్కువ‌గానే  ఉంది. సైనికుడి పాత్ర పాన్ ఇండియా ఈజీగా క‌నెక్ట్ అవుతుంది. మ‌రి లాల్ సింగ్ లో చై  రోల్ ఎలా ఉంటుంద‌న్న‌ది రిలీజ్ త‌ర్వాత  తెలుస్తుంది.
Tags:    

Similar News