• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శౌర్య 'లక్ష్య' టార్గెట్...

శౌర్య 'లక్ష్య' టార్గెట్ ఫిక్స్..!!

By - Tupaki Desk
Update: 2021-09-27 13:00 GMT
యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. ఇండియాలోనే ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో తెరకెక్కుతున్న మొట్ట మొదటి సినిమా ఇది. 'సుబ్రహ్మణ్యపురం' ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ పతకాలపై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఏషియన్ వారు నిర్మించిన 'లవ్ స్టోరి' సినిమా కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చి మంచి వసూళ్ళు రాబడుతోంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు అదే బ్యానర్ లో రూపొందుతోన్న ''లక్ష్య'' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఈరోజు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాగశౌర్య లుక్ ఆకట్టుకుంటోంది.

నాగ శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రం ''లక్ష్య''. ఇందులో యువ హీరో ఇంతకు ముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీని కోసం రెగ్యులర్ గా వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేసాడు. శౌర్య సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటులు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదల చేయబడిన 'లక్ష్య' మూవీ ప్రమోషనల్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుంది. మరి ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇకపోతే నాగశౌర్య హీరోగా నటించిన 'వరుడు కావలెను' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
Tags:    
  • LAKSHYA Movie 
  • LAKSHYA Release Date 
  • LAKSHYA Teaser 
  • LAKSHYA Songs 
  • Naga shourya LAKSHYA 
  • Jagapathi Babu 
  • Santhossh Jagarlapudi 
  • Ketika Sharma 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS