• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఖుషి'.. వారిని ఖుషీ...

'ఖుషి'.. వారిని ఖుషీ చేస్తుందా..?

By - Tupaki Desk
Update: 2022-09-02 23:30 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ''లైగర్'' సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ టైర్-2 హీరోలలో టాప్ లో కొనసాగుతున్న వీడీ.. ఈసారి ఏకంగా పాన్ ఇండియాని టార్గెట్ చేసాడు. దీని కోసం పూరీ జగన్నాథ్ సపోర్ట్ తీసుకున్నాడు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీపై ముందు నుంచే అతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియాని షేక్ చేస్తుందని విజయ్D స్టేట్మెంట్ ఇచ్చాడు.

అయితే ఇటీవల తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదలైన 'లైగర్' మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజే థియేటర్లు వెలవెలబోయాయి. వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి దాదాపు 60 కోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'లైగర్' సినిమా హిట్ అయ్యుంటే VD మార్కెట్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లేది. టాలీవుడ్ టైర్-1 హీరోగా ప్రమోట్ అయ్యే అర్హతలున్న నటుడిగా పరిగణింపబడేవాడు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో తదుపరి సినిమా బిజినెస్ పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.

'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి భారీ డిజాస్టర్స్ తర్వాత విజయ్ దేవరకొండ ఇప్పుడు 'లైగర్' చిత్రంతో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. దీంతో రాబోయే 'ఖుషి' మూవీతో కచ్చితంగా సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరియు సమంత రూత్ ప్రభు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ''ఖుషి''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయింది.

ఈ ఏడాది డిసెంబర్ లో 'ఖుషి' రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు చూస్తుంటే అనుకున్న సమయానికి రావడం కష్టమే అనిపిస్తోంది. ఇకపోతే హీరో విజయ్ దేవరకొండ తో పాటుగా దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. 'టక్ జగదీష్' వంటి ప్లాప్ తర్వాత ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు.

విజయ్ ఇంతకుముందు 'పెళ్లి చూపులు' 'గీత గోవిందం' వంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో సూపర్ హిట్స్ అందుకున్నారు. 'నిన్ను కోరి' 'మజిలీ' సినిమాలతో సెన్సిబుల్ లవ్ స్టొరీలకు శివ నిర్వాణ ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న 'ఖుషి' చిత్రానికి సమంత కూడా జత చేరింది.

ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ 'ఖుషి' టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఇది సక్సెస్ అయితే విజయ్ సానుకూల దృక్పథంతో 'జనగణమన' సినిమాలో నటించే అవకాశం కలిగిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • younghero 
  • vijaydevarakonda 
  • starheroine 
  • samantha 
  • kushi 
  • movie 
  • latestnews 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS