• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ బోయ్ తో 'కుచ్ కుచ్...

రౌడీ బోయ్ తో 'కుచ్ కుచ్ హోతా హై' రీమేక్?

By - Tupaki Desk
Update: 2022-01-02 10:30 GMT
రౌడీ బోయ్ విజయ్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా బోయ్ గా ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోయిన్ల మ‌న‌సుల్లో నిండిపోయాడు. అత‌డి ఛామింగ్ లుక్.. ట్యాలెంట్ కి బాలీవుడ్ యువ‌నాయిక‌లు ఫిదా అయిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి. విజ‌య్ ఓకే అనాలే కానీ అత‌డితో స్వ‌యంవ‌రం కోసం అర‌డ‌జ‌ను మంది హాట్ బాలీవుడ్ హీరోయిన్స్ రెడీగా ఉన్నారు.

లైగ‌ర్ స్టార్ గా ఇప్పుడు అత‌డి మేకోవ‌ర్ ఏ ఇత‌ర బాలీవుడ్ స్టార్ కి త‌క్కువేమీ కాదు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన లైగర్ టీజ‌ర్ లో విజ‌య్ మ్యాన్లీ యాటిట్యూడ్ .. బాక్స‌ర్ గా పంచ్ ల‌కు ప‌డిపోని గాళ్ లేనే లేదంటే అతిశ‌యోక్తి కాదు. బాలీవుడ్ నాయిక‌లు కృతి సనన్- కియారా అద్వానీ- సారా అలీ ఖాన్- జాన్వీ కపూర్-, అనన్య పాండే స‌హా ప‌లువురు భామ‌లు విజ‌య్ తో సినిమాలు చేయాల‌ని క‌ల‌లు గంటున్నారు. అన‌న్య ఇప్ప‌టికే లైగ‌ర్ తో త‌న డ్రీమ్ బోయ్ తో ప‌ని చేస్తోంది. జాన్వీ.. కియ‌రా క్యూలోనే ఉన్నారు.

తాజాగా సారా అలీఖాన్ మ‌రోసారి విజ‌య్ స‌ర‌స‌న న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. అట్రాంగిరే విజయంతో దూసుకుపోతున్న సారాను ఒక ఇంటర్వ్యూలో కుచ్ కుచ్ హోతా హైని రీక్రియేట్ చేస్తే హీరోగా ఎవ‌రు కావాలి? అని ప్ర‌శ్నించ‌గా..``కరణ్ జోహార్ మళ్లీ కుచ్ కుచ్ హోతా హై సినిమా చేస్తే విజయ్ దేవరకొండ - జాన్వీ కపూర్ లతో కలిసి అందులో భాగం కావడానికి ఇష్టపడతాన``ని సారా వెల్లడించింది. సారా- జాన్వి మంచి స్నేహితులు. కలిసి విహారయాత్రలకు వెళ్ల‌డ‌మే కాదు వృత్తిగ‌త విష‌యాల్ని షేర్ చేసుకుంటారు. ఆ ఇద్ద‌రికీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫేవ‌రెట్ హీరో. తాను ఇప్పుడే కరణ్ జోహార్ కి కాల్ చేసి కోరితే.. `కుచ్ కుచ్ హోతా హై`ని పునఃసృష్టి చేయడానికి ముగ్గురూ ఖచ్చితంగా అంగీకరిస్తారని సారా పేర్కొంది.

కెరీర్ ప‌రంగా సారా.. విజ‌య్ ఎవ‌రికి వారు బిజీ బిజీ. లైగ‌ర్ రిలీజ్ త‌ర్వాతా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పెద్ద లైన‌ప్ ఉంది. సుకుమార్ తోనూ అత‌డు సినిమా చేయాల్సి ఉంది. సారా అలీఖాన్ సైతం బాలీవుడ్ లో ఊపిరాడ‌నంత భారీ షెడ్యూల్ తో బిజీగా ఉంది. విజ‌య్ తో తాను కోరుకున్న సినిమాని పూరీనే క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Tags:    
  • Kuch Kuch Hota Hai 
  • Kuch Kuch Hota Hai remake 
  • LIGER 
  • LIGER shooting 
  • LIGER new schedule 
  • Vijay Devarakonda LIGER 
  • Mike Tyson 
  • Liger Vijay Deverakonda 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS