• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబ‌మ్మ మెగా ఆఫ‌ర్ తో...

బేబ‌మ్మ మెగా ఆఫ‌ర్ తో డేరింగ్ స్టెప్‌

By - Tupaki Desk
Update: 2022-01-12 02:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ ...సుకుమార్‌తో క‌లిని చేసిన చిత్రం `ఉప్పెన‌`. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టించిన చిన్న చిత్రాల్లో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు నెల‌కొల్పింది. ఈ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది కృతిశెట్టి.

బేబ‌మ్మ‌గా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుతో పాటు పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్ప‌డు టాలీవుడ్ లో బేబ‌మ్మ క్రేజీ హీరోయిన్. తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `శ్యామ్ సింగ రాయ్‌`లో మోడ్ర‌న్ యువ‌తిగా న‌టించిన లిప్ లాక్ ల‌తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ప్ర‌స్తుతం `బంగార్రాజు` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

సుధీర్ బాబుతో క‌లిసి `ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ తో `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`, హీరో రామ్ తో ఎన్ లింగుసామి రూపొందిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీల‌లో న‌టిస్తూ య‌మ బిజీగా వుంది. అయితే తాజాగా కృతిశెట్టి మ‌రో మెగా ఆఫ‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డం విశేషం. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి డాట‌ర్ సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌బోతున్నారు.

`షూట్ ఔట్ ఎల్ ఆలేర్‌` వెబ్ సిరీస్ తో నిర్మాణ సంస్థ‌ని స్థాపించి తాజాగా న‌ట‌కిరిటీ డా. రాజేంద్ర ప్రాసాద్‌తో నిర్మించిన `సేనాప‌తి` వెబ్ ఫిలింతో ప్ర‌శంస‌ల్ని అందుకున్నారు. తృతీయ ప్ర‌య‌త్నంగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించ‌బోతున్నారు సుష్మిత‌.  `ఉయ్యాల జంపాల‌`, `మ‌జ్ను` వంటి చిత్రాల‌ని అందించి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విరించి వ‌ర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

విరించి వ‌ర్మ `మ‌జ్ను` త‌రువాత మ‌రో సినిమా చేసి చాలా రోజుల‌వుతోంది. అంతే కాకుండా ఆయ‌న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తో సినిమా చేయాల‌ని రెడీ అయ్యారు కూడా.. కానీ ఆ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా కృతిశెట్టితో లేడీ ఓరియెంటెడ్ మూవీకి రెడీ అయిపోయారు. మోడ్ర‌న్ యువ‌తి చుట్టూ సాగే చిత్రంగా ఈ మూవీ యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది.

ఆర‌వ చిత్రానికే మహిళా ప్ర‌ధాన చిత్రం చేస్తుండటంతో కృతిశెట్టి చాలా డేరింగ్ స్టెప్ వేస్తోంద‌ని, అనుష్క శెట్టి 12 చిత్రంగా లేడీ ఓరియోవంటెడ్ మూవీగా రూపొందిన న‌`అరుంథ‌తి` మూవీలో న‌టిస్తే కృతిశెట్టి మాత్రం ఆర‌వ చిత్రాకే ఇలా డేరింగ్ స్టెప్ వేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విరించి వ‌ర్మ డైరెక్ష‌న్ లో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సుష్మిత నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.
Tags:    
  • Kriti Shetty 
  • Kriti Shetty movies 
  • Kriti Shetty shyam singha roy 
  • Kriti Shetty bangarraju 
  • Kriti Shetty aa ammai gurinchi meeku cheppali 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS