• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గతాన్ని గుర్తు చేసి...

గతాన్ని గుర్తు చేసి అందరికి షేర్ చేసి షాకిచ్చింది

By - Tupaki Desk
Update: 2021-08-30 03:31 GMT
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందునా గ్లామర్ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో అన్ని ఎదురుదెబ్బలే అన్నట్లుగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. టాలీవుడ్ లో తాను చేసిన తొలి సినిమానే  డిజాస్టర్ కావటం.. మాంచి హైట్ ఉన్న కృతి సనన్‌ కు అవకాశాలు కష్టమేమో అన్న భావనకు భిన్నంగా ఆమె వరుస సినిమాలు చేయటం తెలిసిందే.

ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ వసూలు చేసే బ్యూటీల్లో ఈ సన్నజాజి మొగ్గ కూడా చెబుతారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో గతం గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీబిజీగా ఉన్న ఆమె.. గతంలో మోడల్ గా చేసిన సందర్భంగా తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్నిషేర్ చేసింది. తాను మోడల్ గా పని చేసే సమయంలో.. తన మొదటి ర్యాంప్ వాక్ లో ఆమె పొరపాటుగా వ్యవహరించింది. దీంతో..సదరు కొరియోగ్రాఫర్  ఏడాపెడా వాయించేసినట్లుగా తిట్టేయటమే కాదు..అసభ్యంగా కూడా వ్యవహరించాడట.

ర్యాంప్ షో ముగిసిన తర్వాత 20 మంది మోడళ్ల ముందు తనను కొరియాగ్రాఫర్ అవమానించటంతో తాను ఆటోలో కూర్చొని బోలెడంత సేపు ఏడ్చినట్లుగా చెప్పింది. అలా ఏడ్చుకుంటూనే ఇంటికి వెళ్లినప్పుడు.. తన తల్లి తనకు ఒక స్ఫూర్తివంతమైన మాట చెప్పినట్లుగా పేర్కొంది.  సినిమా ఇండస్ట్రీలో రాణిస్తావో లేదో కానీ.. ముందు నువ్వు మానసికంగా మరింత బలంగా ఉండాలని చెప్పారట.

 అప్పటి నుంచి తన తల్లి చెప్పిన మాటల్ని మననం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అప్పట్లో దొర్లిన తప్పునకు అంతలా అవమానానికి గురైన కృతి సనన్ ఈ రోజున.. బిజీబిజీ స్టార్ గా మారారని చెప్పాలి. సక్సెస్ ఫుల్ గా ఉన్న వారిని కదిలిస్తే.. ఇలాంటి చేదు అనుభవాలతో పాటు.. ఎన్నో ఎదురుదెబ్బల అనంతరమే ఇలాంటి స్టార్ డమ్ సొంతమవుతుందన్నది మర్చిపోకూడదు.
Tags:    
  • kriti sanon 
  • kriti sanon Movies 
  • kriti sanon rabta 
  • kriti sanon ADIPURUSH 
  • kriti sanon Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS