• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాలవిందులో అదరహో...

అందాలవిందులో అదరహో అనిపిస్తున్న వయ్యారాల జాబిల్లి..

By - Tupaki Desk
Update: 2020-06-15 09:30 GMT
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తీన్మార్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఢిల్లీ బ్యూటీ కృతి కర్బందా. పవన్ కళ్యాణ్ సరసన డీసెంట్ గా తెలుగుతనం నిండిన పాత్రలో అలరించిన కృతి.. ఆ తర్వాత హీరో రామ్ తో 'ఒంగోలు గిత్త' సినిమాలో లంగావోణీ ధరించి మెప్పించింది. అమ్మడు అతికొద్ది కాలంలోనే తన అందంతో అభినయంతో తెలుగులో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఇక అడపాదడపా సినిమాలలో కనిపించింది కానీ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా కెరీర్ ముగిసిందని అనుకునే టైంలో రాంచరణ్ 'బ్రూస్ లీ' సినిమాలో అక్క పాత్రలో కనిపించి బాలీవుడ్ వైపు అడుగేసింది. తెలుగులో అయితే ఎలా అయినా నడిచింది.. కానీ బాలీవుడ్ లో రాణించాలంటే అందాల ఆరబోత తప్పనిసరి. ఈ విషయం తెలిసి అమ్మడు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకొని వరుసగా దూసుకెళ్తుంది. ఇటీవలే హిందీలో కూడా పాగల్ పంతి, హౌస్ ఫుల్-4 సినిమాలతో హిట్ అందుకుంది.

ఇక అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. లాక్ డౌన్ కారణంగా ముంబైలో తన లవర్ పులకిత్ సామ్రాట్ తో ఉంటోందట. సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో అమ్మడు కాస్త ఫోటో షూట్ల పై ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతూ.. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ఊరిస్తుంది. తాజాగా ఓ గ్లామరస్ ఫోటో పోస్ట్ చేసి కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇటీవలే పోల్ డాన్స్ చేసి అదరగొట్టిన కృతి.. తాజాగా ఓ రొమాంటిక్ లుక్ లో పోజిచ్చి అందాల విందు చేసేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తన కెరీర్ లో ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కన్నడ సినిమాలలోనే నటించింది. కృతి నాజూకు నడుమందాలు.. వయ్యారాలు ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయని చెప్పాలి. త్వరలో మళ్లీ షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Tags:    
  • Kriti Kharbanda 
  • Kriti Kharbanda Latest Images 
  • Kriti Kharbanda Latest Instagram Photos 
  • Kriti Kharbanda Latest Movies 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS