టీజర్ టాక్: నాని మళ్లీ వేసేశాడు
అది సరిగ్గా బలే బలే మగాడివోయ్ టీజర్ టైమ్. అప్పుడు కూడా అంతే. క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో మనోడు ముందే చూపించేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కట్ చేస్తే ఇప్పుడు 'కృష్ణగాడి వీర ప్రేమగాద'' సినిమా కోసం కూడా అలాంటి క్రియేటివిటీనే వాడేశాడు. అసలే బ్లాక్ బస్టర్ కొట్టిన ఊపులో ఉన్నాడేమో.. మనోడు ఒక రేంజులో రెచ్చిపోయాడంతే.
హను రాఘవపూడి డైరక్షన్ లో రూపొందిన ఈ కొత్త సినిమా టీజర్ గత సాయంత్రం విడుదలైంది. ఈ టీజర్ లో నాని బాగా కొత్తగా ట్రై చేశాడు. పరిగెడుతూ చెప్పినా తన ప్రేమకథ చెప్పడానికి 2 గంటలు పడుతుందని.. ఇక 30 సెకండ్ల టీజర్ లో ఏం చెప్పగలుగుతాను అంటూ పంచ్ వేసి.. టీజర్ కాని టీజర్.. టీజర్ లాంటి టీజర్.. అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కుర్రాడు. తొలి ప్రయత్నం బాగానే ఉంది. రాయలసీమ థీమ్ అంటూ చెప్పడానికి చేసిన ప్రయత్నం సఫలం అయ్యిందనే చెప్పాలి.
గతంలో అందాల రాక్షసి సినిమాను తీసి కమర్షియల్ గా హిట్టుకొట్టకపోయినా పేరు తెచ్చుకున్నాడు హను. ఈసారి చూస్తుంటే నానితో కలసి మాంచి హిట్టే కొడతాడేమో అనిపిస్తోంది. లెటజ్ సీ.
Full View