బాలయ్య అభిమాని ఫస్ట్ లుక్ ఇచ్చాడు
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీలో బాలకృష్ణ వీరాభిమానిగా నటిస్తుండడంతోమొదట ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తారనే వార్తలొచ్చాయి. అయితే.. ఆ వార్తలను నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్ గతంలోనే ఖండించింది.
ఇప్పుడు నాని మూవీకి ఫిక్స్ చేసిన టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ ఇచ్చారు. జై బాలయ్య తర్వాత వినిపించిన టైటిల్ 'కృష్ణగాడి వీరప్రేమగాధ' నే ఈ చిత్రానికి టైటిల్ గా సెట్ చేశారు. అందాలరాక్షసి ఫేం హను రాఘపపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకుంది. ఓ గన్ గురి పెడితే.. నాని భయపడుతూ చేతులు కట్టుకున్నట్లుగా ఉన్న స్టిల్ బాగుంది. మాస్ లుక్ తో, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, ఓ పక్కకు చూస్తున్న నాని గెటప్ కూడా ఆకర్షణీయంగా ఉంది. కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంలో కొత్త హీరోయిన్ మెహ్రీన్ పీర్జాడా నానికి జంటగా నటిస్తోంది.
ఫస్ట్ లుక్ లో నాని చేతిపై జై బాలయ్య టాటూ కనిపించేలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించబోతున్నారు కూడా. ఫిబ్రవరి 5న కృష్ణగాడి వీరప్రేమగాధను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భలేభలే మగాడివోయ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ ఉందని సమాచారం.