నాని కుమ్మేశాడుగా..
14 రీల్స్ సంస్థ గత రెండు సినిమాలూ పెద్ద డిజాస్టర్లు.. డైరెక్టర్ హను రాఘవపూడి తొలి సినిమా ‘అందాల రాక్షసి’ కమర్షియల్ ఫెయిల్యూర్. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ మొదలయ్యే సమయానికి హీరో నాని పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. అప్పటి పరిస్థితుల ప్రకారమైతే ఈ సినిమాకు బిజినెస్ అవ్వడం కష్టమే. కానీ ఇప్పుడు సీన్ మరోలా ఉంది. విడుదలకు మూడు వారాల ముందే ఫ్యాన్సీ రేటుకు సినిమాను అమ్మేశారు 14 రీల్స్ నిర్మాతలు. నైజాంలో స్వింగ్ మీదున్న ‘అభిషేక్ పిక్చర్స్’ రూ.8.5 కోట్లు పెట్టి సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలు కొనేయడం విశేషం.
‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని సినిమా మీద జనాల్లో భారీ అంచనాలుండటం.. టీజర్ - ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి జనాల్లో అంచనాలు పెంచేయడమే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు ఈ రేటు పలకడానికి కారణం. తెలుగు రాష్ట్రాల హక్కులతోనే 14 రీల్స్ కు పెట్టుబడి తిరిగొచ్చేసింది. ఇక మిగతాదంతా లాభమే. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల్ని పిక్సెల్ డ్రీమ్స్ సంస్థ కోటి రూపాయలకు కొన్నట్లు సమాచారం. ఇంకా కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియా హక్కులు అమ్మాల్సి ఉంది. శాటిలైట్ రైట్స్ కూడా ఎలాగూ ఉన్నాయి. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాతలు విడుదల తర్వాత రైట్స్ అమ్ముదామనుకుంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 14 రీల్స్ వాళ్లకు ఆరేడు కోట్ల దాకా ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తోంది.